Home సినిమా చైతు పర్మిషన్ తో నా పిల్లలకి వాళ్ళు ఎవెంజర్స్ అని చెప్తాను – Prajapalana News

చైతు పర్మిషన్ తో నా పిల్లలకి వాళ్ళు ఎవెంజర్స్ అని చెప్తాను – Prajapalana News

by Prajapalana
0 comments
చైతు పర్మిషన్ తో నా పిల్లలకి వాళ్ళు ఎవెంజర్స్ అని చెప్తాను


ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(శోభిత ధూళిపాళ్ల)గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలవడమే కాకుండా గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలలో వాల్యుబుల్ నటిగా మారింది.రీసెంట్ గా హిందీలో లవ్ సితార అనే వెబ్ సిరీస్ సెప్టెంబర్ 27న విడుదలైంది. .

ఇక పొన్నియన్ సెల్వన్(ponniyin selvan)పార్ట్ 1 వచ్చి రెండేళ్ల వేడుక సందర్భంగా శోబిత ఆ సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయంరవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి తో కలిసి తను తీసిన ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి వీళ్ళందరూ ఎవెంజర్స్ అని నాకి పిల్లలు చెబుతాను అనే క్యాప్షన్ ని ఉంచింది.ఇప్పుడు ఈ పిక్ అండ్ క్యాప్షన్ నెటిజన్స్ ని విశేషంగా ఆకర్షిస్తుంది. అదే విధంగా టీం కి కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు.మొన్న అబుదాబి లో జరిగిన ప్రతిష్టాత్మక ఐఫా అవార్డ్స్ లో కూడా పొన్నియన్ సెల్వన్ పలు అవార్డులను గెలుచుకుంది.

శోభితాకి కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)తో ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం స్నేహితులుగా ఉన్న ఆ ఇద్దరు త్వరలోనే వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. చైతన్య ప్రస్తుతం తండేల్(thandel)మూవీ షూటింగ్ లో ప్రస్తుతం ఉన్నాడు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech