- పాడవుతున్న పంట పొలాలు
- రోగాల బారిన పశువులు
ముద్ర/వీపనగండ్ల :- తిరిగి మిల్లు నుంచి వస్తున్న కలుషిత నీరు చెరువుల చేరడంతో వాటి కింద ఉన్న పచ్చడి పంట పొలాలు, చెరువు నీరు తాగుతున్న పశువులు, గొర్రెలు రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం పుల్గర్ చర్ల గ్రామం సమీపంలోని కొత్తచెరువులోకి శ్రీరంగాపురం మండలం నాగరాల సమీపంలోని గల ఆల్ ఆజీజ్ ఆగ్రో ఇండస్ట్రీస్(హైదరాబాద్ రైస్ మిల్) నుంచి వచ్చే కలుషిత నీరు కొత్తచెరువులోకి చేరడంతో కలుషితమై గ్రామంలో దుర్వాసన వెదజల్లుతుందని గ్రామ మాజీ ఉప సర్పంచ్ నరేష్ కుమార్ యాదవ్, గ్రామస్తులు వాపోయారు.
చెరువులో నీరు పచ్చగా మారి దుర్వాసన వెదజల్లుతుందని చెరువు నీరు తాగిన పశువుల శరీరాలపై పుండ్లు ఏర్పడి మృత్యువాత పడుతున్నాయని, నీటి పంట పొలాలకు వాడడం వల్ల పచ్చటి పంట పొలాలు మురిగిపోతున్నాయని, బత్తుల మల్లయ్య చెందిన ఎకరా వరి పొలం పూర్తిగా పాడైపోయిందని చెప్పారు. మరో కొత్తచెరువు మధ్యలో త్రాగునీరు అందులో బావిని తవ్వి బోర్ కూడా వేయబడింది, ఆ నీటిని తాగుతున్న గ్రామస్తులు కూడా రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. చెరువులో కలుస్తున్నకల్లుషిత నీళ్ల గురించి ఎంపీడీవో శ్రీనివాసరావుకు పంచాయతీరాజ్ అధికారులకు గ్రామస్తుల సమాచారం అందించడంతో చెరువు నీరు, అనారోగ్యం బారిన పడిన పశువులు, పాడైన పంట పొలాలను పరిశీలించారు. పంచాయతీరాజ్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అనంత ప్రసన్న రాణి గ్రామస్తులతో కలిసి నాగరాల సమీపంలోని గల ఆల్జీజ్ ఆగ్రోస్(ఉత్సవ రైస్ మిల్) నుంచి వచ్చే కలుషిత నీరు పరిశీలించారు.
ఇటీవల రైస్ మిల్ సమీపంలోని రెండు పెద్ద గుంతల్లో మిల్లు నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కలుషిత నీరు నిలువ ఉండటం, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వర్షపు నీరు అందులో కాలువల ద్వారా చెరువులోకి కలుషిత నీరు వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. కలుషిత నీరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైస్ మిల్ యజమాని వాహిద్ హెచ్చరిక. అయితే కలుషిత నీటితో పంట పొలాలకు పశువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తాను ఆ కలుషిత నీటినే తన మామిడి తోటకు పంట పొలాలకు ఉపయోగిస్తున్నానని ఇలాంటి రైస్ మిల్ యజమాని గ్రామస్తులకు సమాధానం చెప్పారు. కలుషితనిటీ వల్ల చెరువు నీళ్లు పాడవడంతో తమకు న్యాయం చేయాలంటూ రైతులు మిల్లు యజమానితో వాగ్వాదం చేశారు.మరో మరో మిల్లు నుంచి వచ్చే కలుషిత నీరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, రోగాల బారిన పడిన పశువులకు చికిత్స చేయిస్తానని మిల్లు యజమాని గ్రామస్తులకు తెలిపారు. కలుషిత నీరు చెరువులోకి మిల్లు యజమానిపై అధికారులు చర్యలు తీసుకోకుండా గ్రామస్తులు కోరుతున్నారు.