తెలుగు సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవిచిరంజీవి)కి ఉన్న చరిష్మ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో డాన్స్ లతో, ఫైట్స్ తో తాను ఎదగడమే కాకుండా తెలుగు సినిమాని కూడా ఎదిగేలా చేసాడు.ప్రస్తుతం సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న విశ్వంభర(విశ్వంభర)లో ఒక ఎనర్జటిక్ రోల్ లో చేస్తున్నాడు.యంగ్ హీరోలకి ధీటుగా రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటూ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.
రీసెంట్ గా చిరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేసాడు.1974లో నర్సాపూర్ వైఎన్ఎం కాలేజీలో తొలిసారి కోన గోవింద రావు గారి రచనలో 'రాజీనామ' అనే నాటకంలో నటించాను.నటుడిగా తొలి గుర్తింపు పొందడంతో పాటు,ఉత్తమంగా కూడా అవార్డులు అందుకున్నాను. అది నాకు నటనలో ఎదగడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆ రకంగా చూస్తుంటే నా నటనకి యాభై సంవత్సరాలు గడిచినట్టే.ఈ విషయంలో ఎనలేని ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేసాడు. యుక్త వయస్సులో ఉన్న అప్పటి పిక్ ని కూడా షేర్ చేయడం జరిగింది.అందులో చిరు ఒరిజినల్ నేమ్ తో పాటు ఆయన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి.
చిరు నటించిన తొలి సినిమా పునాది రాళ్లు అయినా కూడా రిలీజైన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు.1979లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. అంటే రంగస్థలం మీద అవార్డుని అందుకున్న కొన్ని సంవత్సరాలకే చిరు సినీరంగ ప్రవేశం చేసి నేటికీ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.ఇక చిరు పోస్ట్ అండ్ పిక్ చూసిన ఫ్యాన్స్ అయితే చిరు కి కంగ్రాట్స్ చెప్తున్నారు.