24
ముద్ర, తెలంగాణ బ్యూరో : సభలో చర్చ లేకుండా పద్దులను ఏకపక్షంగా ఆమోదించారని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేసే పరిస్థితి నెలకొనడం విచారకరమని అన్నారు. గతంలో చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేందుకు అధికార కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రూ.1100 కోట్ల మేర ఉంది. ఈ కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి విచారణకు ఆదేశించిందిగా కోరతామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.