మూసీ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాలను ఎఫ్టీఎల్,బఫర్ జోన్ల పరిధిలో ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తోంది.అయితే, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్రూం లు కేటాయిస్తానని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా కొందరిని ఇప్పటికే స్థానికంగా ఉన్న డబుల్ బెడ్రూం సముదాయాల్లోకి తరలిస్తున్నారు. మరికొందరు నిర్వాసితులను ఇతర ప్రాంతాలలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విధంగానే చెంచల్గూడ ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తమ కోసం నిర్మించిన డబుల్ ఇళ్లు మూసీ నిర్వాసితులకు కేటాయించడం ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను కేవలం స్థానికులకు మాత్రమే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతూ.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ తాత్కాలిక తోపులాట జరిగింది. అయితే, చంచల్గూడ డబుల్ ఇళ్లను అధికారులు ఎవరికి కేటాయిస్తారనే సస్పెన్స్ అందరిలోనూ ఉంది.