27
ముద్ర/వీపనగండ్ల:- తోగుట వీర క్షత్రియ కుల దేవత శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరీ దేవత అమ్మవారి పుట్టినరోజు వేడుకలను మండల పరిధిలోని తూముకుంటలో ఘనంగా నిర్వహించారు. ఉదయమే అమ్మవారికి పేద బ్రాహ్మణులచే పంచామృత అభిషేకం, అర్చనలు చేశారు. వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు జల్లు రంగయ్య,ఈశ్వరయ్య, శివరాములు, శివకుమార్, సత్యనారాయణ,శ్రీనివాసులు,భాస్కర్ ఉన్నారు.