- బాధ్యతలు స్వీకరించిన చైర్మన్
- గౌని ప్రమోదని రెడ్డి
- పెబ్బేరుకు కాపలాదారుడుగా పనిచేస్తా
- రైతు రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కుBRS నాయకులకు లేదు
- వనపర్తి ఎమ్మెల్యే తూడిమెగా రెడ్డి
ముద్ర, పెబ్బేరు: పెబ్బేర్ పట్టణంలో మంగళవారం రోజు పెబ్బేర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. కళాకారులు, డబ్బులు ,తప్పట్లతో, బాణాసంచా కలుపుతూ ఘనంగా జరిగింది. జిల్లా అధికారి స్వరణ్ సింగ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, డైరెక్టర్‌లకు ప్రమాణస్వీకారం చేశారు. యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి.
తనపై ఇంత అభిమానం చూపి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కాపలాదారుడిగా ఉండి పనిచేస్తానని వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన అధ్యక్షుడు ఉపాధ్యక్షులతో పాటు డైరెక్టర్లు అందరినీ సన్మానించి సన్మానించారు.
ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యేకు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు డప్పు వాయిద్యాల మధ్య బాణాసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.పెబ్బేరు మండల వ్యవసాయ మార్కెట్ యార్డును విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఎల్లవేళలా నూతనంగా కృషి చేస్తానని ఎన్నికల మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు డైరెక్టర్లు తెలిపారు. అందరూ మార్కెట్ నిశల కృషి చేయడం కోసం ఎమ్మెల్యే అభివృద్ది చెందాలని సూచించారు.కబ్జాకు గురైన పెబ్బేరు సంతస్థలానికి తాను కావాల్సిన 30 ఎకరాల 22 కుంటలకు దగ్గరుండి కంపౌండ్ వాల్ ఏర్పాటు చేయిస్తానని ఆయన అన్నారు.
రైతు రుణమాఫీ పై మాట్లాడి నైతిక హక్కు Brs పార్టీ నాయకులకు లేదని లక్ష రుణమాఫీ అందించిన విడతల వారిగా అన్నదాతలను అనేక ఇబ్బందులకు గురిచేసిన ఏకైక ప్రభుత్వం brs ప్రభుత్వమని ఎమ్మెల్యే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలుపొందిన brs పార్టీకి 69 వేల కోట్లు అప్పు చూయిస్తే కేవలం 10 సంవత్సరాలలో brs పార్టీ ఆరు లక్షల 80 వేల కోట్ల రూపాయలను అప్పుగా చూపించి రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఏకైక పార్టీ brs అని mla పేర్కొన్నారు.
రానున్న గాంధీ జయంతి నుంచి రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ డిజిటల్ రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉందని ఆయన వివరించారు.గతంలో కాంగ్రెస్ పార్టీ అందించే తొమ్మిది రకాల రేషన్ సరుకులను ఎమ్మెల్యే గుర్తించారు.కొంతమంది Brs నాయకులు పని లేక పాత పనులకు శంకుస్థాపనలు సమీక్షిస్తున్నారని 2009లో ప్రారంభించారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు అక్కడ బొక్కలు పెట్టి తామే సాగు నిరందించామని ప్రగల్బాలు పలికే వీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
ఇండ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు త్వరలోనే అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ,మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ సాయినాథ్ కౌన్సిలర్లు శ్రీరంగాపురం పిఎస్ఎస్ చైర్మన్ జగన్నాథం నాయుడు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కార్పాకుల వెంకట రాములు ,మాజీ సర్పంచులు వెంకటేష్ సాగర్, సురేందర్ గౌడ్, రవీందర్ నాయుడు, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దయాకర్ రెడ్డి ,భాను ప్రకాష్ రెడ్డి ,యుగంధర్ రెడ్డి , సర్వేశ్, రాముడు, శివ, శ్రీహరి రాజులు పనిచేసేవారు.