Home తెలంగాణ గ్రామాలన్నీ సర్వేల మయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

గ్రామాలన్నీ సర్వేల మయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
గ్రామాలన్నీ సర్వేల మయం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • సమగ్ర సర్వే ఓ వైపు
  • రాజకీయ సర్వేలు మరోవైపు
  • ప్రభుత్వ అనుకూలత, ప్రతికూలతపై బీఆర్ఎస్ టీంలు
  • ప్రజల నాడిని పసిగట్టేందుకు కాంగ్రెస్ స్పెషల్ టీంలు
  • గ్రామాల వారిగా వివరాల సేకరణలు రాజకీక్ష పక్షాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సర్వేల జాతర నడుస్తోంది. ఎన్నికలు లేకున్నా.. రాజకీయ పార్టీలు గ్రామాల్లో ప్రజల మూడ్‌ను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల ముందు జరిగే సర్వేలు.. ఇక్కడ ఎలాంటి ఎలక్షన్స్ లేకున్నా గ్రామాల్లో మొదలు పెట్టారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు గడిచింది. ఇలాంటి సమయంలో సర్వేలకు దిగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు గడిచింది. మరో రెండు నెలల్లో ఏడాది పూర్తి చేసుకోబోతోంది. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న మూడ్‌ను తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఏమనుకుంటున్నారు..? పథకాల లక్ష్యాలు ఎలా ఉన్నాయి..? పథకాలపై వారి ఫీడ్ బ్యాక్ ఏంటి..? గత పదేళ్లకు ఇప్పటికి సంతృప్తికరంగా ఉన్నారా..? ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? బీఆర్ఎస్ నాయకుల వైఖరిపై ఏం అనుకుంటున్నారా..? ఈ 11 నెలల కాలంలో ప్రభుత్వ సక్సెస్‌లు ఏంటి..? ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి..? లోకల్ ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉంది..? మంత్రులు ఎలా వ్యవహరిస్తున్నారు..? స్థానిక నేతలు ప్రజలను పట్టించుకుంటున్నారా..? ఆరు గ్యారంటీలపై ప్రజల్లో ఎలాంటి టాక్ ఉంది..? ఇలాంటి ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నల్‌గా ఈ సర్వే చేస్తున్నారు. సర్వేలో వచ్చిన అభిప్రాయాలతో భవిష్యత్తులో పాలనాపరంగా మార్పులు.. కావాల్సిన పథకాలకు రూపకల్పన చేయాలనుకుంటున్నారు. ఇంకా పదేండ్ల తరువాత అధికారంలోకి రావడంతో సక్సెస్ ఫుల్‌గా వన్ ఇయర్ పూర్తి చేసుకుంటూ ఉండటంతో వన్ ఇయర్ సంబరాలను కూడా గ్రాండ్ గా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

వ్యతిరేకత పెరిగిందా.. రంగంలోకి

బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి పదేళ్ల పాటు గులాబీ పార్టీనే అధికారంలో కొనసాగుతోంది. అయితే.. గత పది నెలలుగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పెద్దగా ప్రజల్లో వచ్చిన దాఖలాలు లేవు. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఒకటి రెండు సందర్భాల్లో మినహా ఆయన కనిపించలేదు. అనారోగ్య కారణాలు వేధించడం.. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఫామ్‌హౌజ్ దాటి రావడం లేదని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సరే.. కారణాలు ఏవైనప్పటికీ కేసీఆర్ రాకకోసం ఆయన అభిమానులు మాత్రం ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్రంలో సీక్రెట్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తెలుసుకునేందుకు ఈ సర్వే చేస్తోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలపైనా ఆరా తీస్తోంది. ముఖ్యంగా.. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పనితీరు ఎలా ఉంది..? కొత్త ప్రభుత్వం ఎలా కొనసాగుతోంది..? ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయి..? ఆయన భాష తీరు, ప్రతిపక్షాలపై, కేసీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందా..? ఒకవేళ రేవంత్ స్థానంలో వేరే వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుంది..? ఇచ్చిన గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా..? లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయా..? తెలంగాణ అభివృద్ధి రేవంత్‌తో సాధ్యం అవుతుందా..? పరిశ్రమలను తీసుకురావడంలో ఏ మేరకు సఫలీకృతం అయ్యారు..? రాష్ట్రంలో పెట్టుడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలు మళ్లీ ఇతర రాష్ట్రాలకు తరలడానికి గల కారణాలు..? నిరుద్యోగులకు, వారికి ఏ మేరకు భరోసా ఇచ్చారు..? అటు రైతులకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలయ్యాయా..? మూసీ, హైడ్రామాలపై ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉంది..? ఇళ్లను కూల్చడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఇలా ప్రశ్నలతో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. అయితే ఈ సర్వే రిపోర్టు ఆధారంగానే బీఆర్ఎస్ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించబోతున్నట్లు ప్రచారం. అధినేత కేసీఆర్ ప్రత్యేక ఆసక్తితో ఈ సర్వే చేయిస్తున్నారని, ఈ రిపోర్టు ఆధారంగానే మరికొద్ది రోజుల్లో ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వేలు నిర్వహించడం మరింత హాట్ టాపిక్ అయింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech