Home తెలంగాణ గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్త నుండి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా అంచలంచెలుగా ఎదిగిన చెవిటి వెంకన్న యాదవ్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్త నుండి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా అంచలంచెలుగా ఎదిగిన చెవిటి వెంకన్న యాదవ్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్త నుండి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా అంచలంచెలుగా ఎదిగిన చెవిటి వెంకన్న యాదవ్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించిన చెవిటి
  • రాష్ట్ర రైతు కమీషన్ సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు చెవిటి వెంకన్న యాదవ్

తుంగతుర్తి ముద్రణ: సుమారు మూడు దశాబ్దాల క్రితం తుంగతుర్తి నియోజకవర్గం గుమ్మడవెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా అరంగేట్రం చేసి నేడు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎంపికైన చెవిటి వెంకన్న యాదవ్ రాజకీయ ప్రస్థానం అంచలంచలుగా ఎదిగింది. నియోజకవర్గంలోని గుమ్మడవెల్లి గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చెవిటి వెంకన్న యాదవ్ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేశారు. మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో సుదీర్ఘకాలం పనిచేసిన చెవిటి వెంకన్న యాదవ్ అటు రాజకీయ పదవులు నామినేటెడ్ పదవులు ఎలాంటి మచ్చ లేకుండా జరిగాయి. తుంగతుర్తి మండలం పార్టీ అధ్యక్షునిగా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు మార్లు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా రెండు మార్లు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన చెవిటి వెంకన్న యాదవ్ కు రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం నేడు రాష్ట్ర రైతు కమీషన్ సభ్యునిగా పదవి ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. చేస్తున్నారు. చెవిటి వెంకన్న యాదవ్ రాజకీయ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు .కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడడంలో ముందు వరుసలో ఉన్నారు. అనేకమార్లు ప్రత్యర్థుల దాడుల నుండి ప్రాణాపాయ పరిస్థితుల నుండి తప్పించుకున్నారు.

ఎన్నో పోరాటాలు చేసి అటు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని మెప్పిస్తూ ఇటు తనను నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకుంటూ తన రాజకీయ ప్రస్థానంలో అవినీతికి తావు లేకుండా ముందుకు సాగారు. రాజకీయాల్లో అనేకమంది అవకాశం కోసం పార్టీలు మారిన నేపథ్యంలో చెవిటి వెంకన్న యాదవ్‌కు ఇతర పార్టీల నుండి అవకాశాలు రానున్నాయి. రెండుసార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నిర్వహించిన వెంకన్న యాదవ్ అందరి నాయకులతో మమేకమై పార్టీ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. రాష్ట్ర మంత్రులతో సత్సంబంధాలు నెలకొల్పుకొని తాను ముఖ్యమంత్రి వద్ద సైతం మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర రైతు కమీషన్ ఏర్పాటు కాగానే చెవిటి వెంకన్న యాదవ్ పేరును ముఖ్యమంత్రి ఖరారు చేయడం. సూర్యాపేట జిల్లాలో బీసీ నాయకుల్లో మంచి పేరున్న నాయకుడు చెవిటి వెంకన్న యాదవ్ గా పేరు తెచ్చుకున్నారు. యాదవ సామాజిక వర్గంతో పాటు ఇతర బీసీ సామాజిక వర్గాల్లో సైతం చెవిటి వెంకన్న మంచి పట్టు సాధించారు .వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా వచ్చిన రైతుల కష్టనష్టాలు తెలిసిన వెంకన్న యాదవ్‌కు రైతు కమీషన్ సభ్యులుగా రావడం రైతుల మేలు కోసమేనని తాను స్వయంగా వ్యవసాయం చేస్తూ రైతుగా తనకున్న అనుభవంతో వారి కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతు కమీషన్‌లో ఉన్నారు. రైతులకు మేలు జరిగేలా చేస్తారని యావత్ రైతాంగం భావిస్తుంది.

తనకు రాష్ట్రస్థాయిలో పదవి రావడానికి తాను పార్టీలో పడిన కష్టం తన కష్టాన్ని గుర్తించిన జిల్లా రాష్ట్ర నాయకత్వం పట్ల వెంకన్న యాదవ్ కృతజ్ఞతా భావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తనకు రాష్ట్ర రైతు కమీషన్ మెంబర్‌గా అవకాశం ఇవ్వడం పట్ల శుక్రవారం కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. చెవిటి వెంకన్న యాదవ్ రాష్ట్ర రైతు కమీషన్ సభ్యులుగా శనివారం పదవి బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాదులోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టడం. ఏది ఏమైనా ఏమైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు వచ్చిందని చెవిటి వెంకన్న యాదవ్ కు రాష్ట్రస్థాయి పదవి రావడంతో కాంగ్రెస్ నాయకులు జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి పదవిని పొందిన చెవిటి వెంకన్న యాదవ్ మరింత ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech