ముద్ర.వీపనగండ్ల:- గోవులను గేదెలను అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంచి వాటి ఆలనా పాలన చూడకుండా హింసిస్తూ, చుట్టుప్రక్కల కుటుంబాల వారికి ఇబ్బందులు పడుతున్న కానమోని కిష్టయ్య అనే రైతు ఆవులను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని లేకుంటే వాటిని అక్కడి నుంచి తరలించాలని తాసిల్దార్ వరలక్ష్మి తెలియజేశారు. మండల కేంద్రమైన పనగండ్ల గ్రామానికి చెందిన కానమోని కిష్టయ్య అనే రైతు గత కొన్ని సంవత్సరాలుగా వెళ్లే దారిలో చుట్టుప్రక్కల కుటుంబాలు నివసించే ఇండ్ల మధ్య తన సొంత స్థలంలో సుమారు 80 ఆవులను గేదెలను అపరిశుభ్రత వాతావరణంలో పెంచుతున్నాడు.
పశువులకు సరైన మేత లేక ఆకలితో అలుమటిస్తూ వాటిని ఇబ్బందులకు గురి చేయడమే కాక, వాటి నుంచి వచ్చే ప్రదేశంలో వర్షపు నీరు నిల్వ ఉండి మురికి కోపంగా తయారై దోమలకు ఈగలకు నిలయంగా మారి వ్యాధులు ప్రబలుతున్నాయని, మరో పేద రొచ్చు వాసులను భరించలేక తిండి కూడా తినలేక పోతున్నామని చుట్టుప్రక్కల కుటుంబాల వారు పలుమారు పశువుల యజమానిపై మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేశారు. అయితే గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పశువుల నుంచి వచ్చే వాసనను భరించలేకపోతున్నామని, దోమలు ఈగలు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నామని, పశువులను అక్కడి నుంచి వెంటనే తరలించి తమను రక్షించాలని కాలనీ వాసులు అధికారులకు మొరపెట్టుకున్నారు. గురువారం తాసిల్దార్ వరలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పోలీసులు పశువులు నివసించే స్థలం వద్దకు వచ్చి వెంటనే అపరిశుభ్రత వాతావరణంలో ఉంచిన పశువులను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని, దానిని శుభ్రంగా ఉంచాలని యజమాని కిష్టయ్యను సూచించారు.
ఆసక్తి గల రైతులు దానపూర్వకంగా తీసుకెళ్లవచ్చు….
యజమానికి రోజులు గడువు ఇచ్చామని, ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించడం గాని, లేకుంటే మండలంలో ఆసక్తి గల రైతుల ఆసక్తిని పెంచేందుకు తాసిల్దార్ గాని రెండు పోలీస్ స్టేషన్‌లో రైతులను సంప్రదించి అగ్రిమెంట్ రాసి తీసుకెళ్లవచ్చని తాసిల్దార్ వరలక్ష్మి తెలిపారు. కానమోని కిష్టయ్యకు నరకయాతన చూపడం, వాటికి సరైన తిండి లేక చిక్కిపోయాయని, పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడంతో, మురికి నీటిలో, బురదలో ఉండి అనారోగ్య పాలవుతున్నాయని, అంతేగాక చుట్టుప్రక్కల పశువులు వీటినుంచి ఇబ్బందులు పడుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.