రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల విడుదలైన 'రా మచ్చ మచ్చ..' సాంగ్ గత వారం సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ దసరాకి విడుదల కాబోతోంది. దీంతో 'గేమ్ ఛేంజర్' ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. మచ్చ మచ్చ సాంగ్ రీల్స్ నెట్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మొదటి నుంచీ గేమ్ ఛేంజర్ చిత్రంపై నెగిటివిటీని స్ప్రెడ్ చెయ్యాలని యాంత్రిక మెగా ఫ్యాన్స్ రకరకాలుగా ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాపై వస్తున్న రీల్స్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగింది? రామ్‌చరణ్ సినిమాపై ఇంత నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అవుతోంది.
'రా మచ్చ మచ్చ' సాంగ్‌ని రీల్స్ చెయ్యాలనీ, అలా చేస్తే చిత్ర యూనిట్ డబ్బులు ఇస్తోందనే ప్రచారం ఊపందుకుంది. దీన్ని కన్ఫర్మ్ చేస్తూ వచ్చిన ఓ స్క్రీన్ షాట్ వైరల్‌గా మారింది. 'అందులో 'రీల్' చేయడానికి అందరికీ 10 వేలు ఇస్తున్నారట.. నువ్వు కూడా తీసుకున్నావు. నిజమేనా?' అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మెహబూబ్ 'అవును' అని సమాధానం చెబుతూ '80 వేలు పంపారు. ట్యాగ్స్ వాళ్ళే ఇచ్చి రీల్ చేయమని చెప్పారు' అని చాటింగ్‌లో ఉంది. ఇదే పరిశీలన ఓ నెటిజన్ మెహబూబ్‌ని చాటింగ్‌ని చూపిస్తూ ఇది మీదేనా అని అడిగాడు. దానికి మెహబూబ్ 'బాగా ఎడిట్' చేశారు. చాలా టాలెంట్ ఉంది. ఈ చాటింగ్ చేసిన అవతలి వ్యక్తి పేరు కూడా ఉంటే బాగుండేది' అన్నాడు. అన్నీ చూస్తుంటే గేమ్ ఛేంజర్ సినిమాని యాంటీ మెగా ఫ్యాన్స్ ఎలా ఆడుకుంటున్నారో అర్థమవుతుంది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో మరి.