గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)అప్ కమింగ్ మూవీ 'గేమ్ చేంజర్'(గేమ్ ఛేంజర్).సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై ఇప్పుడిప్పుడే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.లక్నో వేదికగా టీజర్ రిలీజ్ అవ్వక ముందు ఎవరిలో కూడా 'గేమ్ చేంజర్' పై పెద్దగా అంచనాలు లేవు.మూవీ ఎప్పట్నుంచో షూటింగ్ జరుపుకోవడం,దర్శకుడు శంకర్ 'గేమ్ చేంజర్' ని పక్కన పెట్టి భారతీయుడు 2 కి వెళ్లడం,పైగా ఆ మూవీ భారీ డిజాస్టర్ ని అందుకోవడం వంటి కారణాలతో గేమ్ ఛేంజర్ పై ఎవరికి కూడా అంచనాలు లేవు.కానీ ఇప్పుడు అలా కాదు మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడు 'గేమ్ చేంజర్' థియేటర్ లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
రీసెంట్ గా గేమ్ చెంజర్ కి సంబంధించిన రివ్యూ ఇదే,సినిమా ఉంటుంది,అలా ఉంటుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.అవుట్ ఫుట్ కూడా మాములుగా రాలేదని,ఫస్ట్ ఆఫ్ లో వచ్చే కాలేజీ సీన్స్ అదిరిపోయాయని,ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ ఆఫ్ పీక్ లో ఉందని,సెకండ్ ఆఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు,వాటిల్‌లోని రామ్ చరణ్ నటన నభూతో నభవిష్యత్తు అని అంటున్నారు.ఇక తమిళనాట శంకర్(శంకర్)సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.దీంతో తమిళ సోషల్ మీడియాలో 'గేమ్ చేంజర్' ద్వారా పాత శంకర్ ని చూడబోతున్నామని, మూవీ ఒక రేంజ్ లో ఉందనే రివ్యూలు హల్ చల్ చేస్తున్నాయి.
పుష్ప 2(పుష్ప 2)తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులని నెలకొల్పిన సుకుమార్(సుకుమార్)కూడా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతు చిరంజీవి(చిరంజీవి)గారితో కలిసి గేమ్ చెంజర్ ని చూసాను,మూవీ ఒక రేంజ్ లో ఉంది.చరణ్ నటనకి నేషనల్ అవార్డు రావడం ఖాయమని చెప్పారు. .దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న గేమ్ చెంజర్ రివ్యూ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చరణ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతున్న గేమ్ చెంజర్ ని దిల్ రాజు నిర్మించగా కియారా అద్వానీ హీరోయిన్ కాగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.