30
తుంగతుర్తి ముద్ర:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని 4వ వార్డులో గత రోజులుగా త్రాగునీరు రావడం లేదని సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి ఎమ్మార్వో ఛాంబర్‌లో ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. త్రాగునీరు పైపులైన్లను మరమ్మత్తులు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం తహసిల్దార్ కాటమయ్యకు సమస్యను వివరించి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కోట రామస్వామి, మహిళలు త్రివేణి, నాగమ్మ, సోమలక్ష్మి, నాగమ్మ, వెంకన్న, రామగిరి వెంకన్న, రజిత నిర్వహించారు.