Home తెలంగాణ కోల్ కత్తాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన హేయనీయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

కోల్ కత్తాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన హేయనీయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
కోల్ కత్తాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన హేయనీయం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • రాష్ట్రంలో మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం
  • తరగతి గదుల నుంచే మహిళలను గౌరవించడం నేర్పించాలి
  • గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిరసనకు మంత్రి సీతక్క సంఘీభావం

ముద్ర, తెలంగాణ బ్యూరో : కోల్ కత్తాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన హేయమైన చర్య అని, వైద్యులకు అండగా నిలుస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కోల్ కత్తాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ బుధవారం ఆసుపత్రిలో వైద్యుల ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రికి మంత్రి సీతక్క వెళ్ళి వైద్యుల సంఘీభావం ప్రకటించారు.

అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు దేవతలతో సమానమని, వారిపై జరుగుతోన్న అఘాయిత్యాలను నిలబెట్టుకోవాలని అన్నారు. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు రావడానికి అలవాటు పడుతున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మళ్లీ మధ్య యుగాలకు తీసుకెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తరగతి గదుల నుంచే మహిళలను గౌరవించాలంటే అంశాలను నేర్పించాలన్నారు.

మహిళ రక్షణ అంశంపై ప్రతి ఒక్కరిలో ఆలోచన మారాలన్నారు. మహిళల పట్ల తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం. సీఎం రేవంత్ రెడ్డి మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కఠినమైన చట్టాలు అమలు చేస్తూ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech