- బెటాలియన్ పోలీసులను అరెస్టు చేసిన పోలీసులు
- సచివాలయం చుట్టూ ఆంక్షలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఒకే పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఖాకీలు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సోమవారం సచివాలయం ముట్టడికి వివిధ బెటాలియన్ల పరిధిలోని కానిస్టేబుళ్ళు పిలుపునివ్వడంతో సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సచివాలయం చుట్టూ సెక్షన్ 163ని అమలు చేశారు. కాగా ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకున్న బెటాలియన్ కానిస్టేబుళ్ళు ఆందోళనకు దిగారు. 39 మంది కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేయడం, 10 మందిని ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయానికి పిలుపునిచ్చిన వారిని ముందు జాగ్రత్తగా పోలీసులు అరెస్టు చేశారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్ చర్చించి న్యాయం చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్ళు కోరుతున్నారు.