న్యూ ఇయర్ వస్తోందంటే.. అందరూ సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఎవరికి తోచిన వారు కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కొత్త సంవత్సరం సరికొత్త సినిమాల రిలీజ్ కోసం చూస్తారు. ఆ వెంటనే సంక్రాంతి పండగ వస్తోంది. ఆ సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాల కోసం ప్రేక్షకుల్లో హడావిడి మొదలైపోతుంది. మరి కొత్త సంవత్సరం పాత సినిమాలు ఏమిటి? అని అందరికీ అనిపించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా జనవరి 1న కొన్ని సినిమాలను రీరిలీజ్ చేసే ఆనవాయితీ నడుస్తోంది. దాన్ని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ కోసం రంగం సిద్ధమైంది. రీరిలీజ్ అనగానే ఆ సినిమాలోని హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ నానా హంగామా చేస్తారు. ఇక న్యూ ఇయర్ రోజు రిలీజ్ అంటే అది మామూలుగా ఉండదు.
ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వరస ఫ్లాపుల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి కొత్త ఊపిరినిచ్చిన సినిమా 'హిట్లర్'. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమా జనవరి 1న విడుదల చేయబోతున్నారు. ఇక కొత్త ఏడాది 2025కి స్వాగతం పలుకుతూ హీరో నితిన్ తనకి ఎంతో పేరు తెచ్చిన 'సై' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి యూత్ ఎంజాయ్ చెప్పిన అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. మరో సినిమా సిద్ధార్థ్, షామిలి జంటగా రూపొందించిన 'ఓయ్' చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఇంతకుముందే రీరిలీజ్ మంచి రెస్పాన్స్‌ని దక్కించుకుంది. ప్రస్తుతానికి కొత్త సంవత్సరంలో విడుదలయ్యే భారీ సినిమాలు ఏవీ లేవు. ఆ స్థానంలో పాత సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.