- పుణ్యక్షేత్రాలకు కొత్త రైల్వే మార్గం కోసం కొట్లాడు
- దమ్ముంటే కరీంనగర్ కు పెద్ద ప్రాజెక్టు తీసుకురావడం
- నియోజకవర్గ ప్రజలు అంటే ఇంత చులకనా?
- సంచలనాల కోసం ప్రాకులాడకు
- వెలిచాల రాజేందర్ రావు ఫైర్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కేంద్ర మంత్రివర్గం శుక్రవారం 8 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసిందని, ఇందులో కరీంనగర్ పార్లమెంట్ కొత్త రైల్వే లైన్ మార్గం కూడా సాధించలేకపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అసమర్ధతే కారణమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. కరీంనగర్ కు సంబంధించి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఒక ప్రతిపాదన చేశారా? ఆహ్వానం కోసం కేంద్ర మంత్రులను కలిశారా.. ఏమైనా ప్రయత్నం చేశారా.. బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం వెలిచాలేందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఒక్క రాజ ప్రాజెక్టు చేయించుకున్న దద్దమ్మ బండి సంజయ్ అని తెలిపారు. బండి సంజయ్ కేంద్ర మంత్రివర్గంలో కరీంనగర్ కు ఒక పెద్ద ప్రాజెక్టు ఇవ్వడానికి ఆమోదముద్ర వేయించాలని డిమాండ్ చేశారు. మొదటి సారి ఐదేళ్ల పదవీ కాలంలో ఒక ప్రాజెక్టు కూడా సాధించలేకపోయిందని చెప్పారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం 24,657 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది కొత్త మార్గాలకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
కరీంనగర్ పై మీకు ప్రేమ ఉంటే ఒక్క ప్రతిపాదన అయినా చేసి చేయించే వారని ధ్వజమెత్తారు. మనోహరాబాద్ టు హైదరాబాద్.. సిద్దిపేట టు సిరిసిల్ల-వేములవాడ కొత్తపల్లి రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షించే వారని పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ ఏమి ఉపయోగమో అక్కడ ఆ పనులపై దృష్టి పెడితే ప్రజలు అది కాలాలపాటు గుర్తుంచుకుంటారని సూచించారు. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం కరీంనగర్ ప్రజలు ఊరుకోరని పేర్కొన్నారు.
ప్రతిసారి కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా ప్రవర్తించడమే మీ నైజాం అని ప్రశ్నించారు. భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గంగా, వేములవాడ- కొండగట్టు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఎదురుగా ఉండేలా కొత్త రైల్వే లైన్ మార్గాన్ని అందించాలని బండి సంజయ్‌కు సూచించారు. వేములవాడ- కొండగట్టు ఆలయాలకు నిత్యం ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాల ప్రజలు లక్షలాదిగా తరలివస్తుంటారని పేర్కొన్నారు.
వారి సౌకర్యార్థం రైల్వే లైన్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ పుణ్యక్షేత్రాలకు దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు మార్గం అనుసంధానం కానుందని తెలిపారు. రైల్వే లైన్ నిర్మాణం వల్ల వేములవాడ-కొండగట్టు ప్రాంతాలు పర్యాటకంగా కూడా మరింత అభివృద్ధి చెందాలని సలహా ఇచ్చారు.
మీడియాలో సంచలనాల కోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడమే నేర్చుకున్నారని. సంచలనాల కోసం ప్రాకులాట మానుకోవాలని హితవు పలికారు. మళ్లీ రెండోసారి ప్రజలు మోసపోయి గెలిపిస్తే అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు.
మొదటి ఐదేళ్ల కాలంలో తప్పిపోయినదాన్ని మళ్లీ బండి సంజయ్, కేంద్ర మంత్రి పదవిలో ఉన్న దృష్ట్యా కరీంనగర్ ప్రజలు జీవిత కాలం మర్చిపోలేని అభివృద్ధి చేసి చూపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కరీంనగర్ కు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పెద్ద ప్రాజెక్టు ఇవ్వాలని సూచించారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు రావాలని సూచించారు.