- మాడ్ మానేరు కొట్టుకుపోయేందుకు ఎత్తు పెంపు కారణం
- 2016లో కొట్టుకుపోయిన మిడ్ మానేరు
- అప్పటి సీఎం, అధికారుల నిర్లక్ష్యంపై విజిలెన్స్ రిపోర్ట్
- ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విజిలెన్స్ టీం
ముద్ర, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు ఒక్కోక్కటిగా బయట పడుతున్నాయి. 2016లో మిడ్‌మానేరు ప్రాజెక్టు స్పిల్‌వే ఎత్తు పెరగడం వల్ల కొట్టుకుపోయిందని విజిలెన్స్ అధికారులు మరో నివేదికను అందించారు. ఇప్పటికే యాదాద్రి థర్మల్ ప్లాంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలతో ఇక్కట్లు పడుతున్న కేసీఆర్‌కు, ఇరిగేషన్, విద్యుత్ కీలక సూత్రదారులకు చెమటలు పడుతుండగా.. మిడ్‌మానేరు విషయంలో కూడా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు అందించారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ మరో షాక్ తగిలినట్లుగా మారుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల కుంగిపోవడం, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కేసుల్లో విచారణలతో కేసీఆర్ కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్‌కి సంబంధించిన కేసు విచారణ మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లు అయింది. 2016లో మిడ్ మానేరులో జరిగిన ప్రమాదంపై విజిలెన్స్ అధికారులు సంచలన రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించారు. 2016లో మిడ్ మానేరు కట్ట కొట్టుకుపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విచారణకు విచారణ జరిపింది.. అది నామమాత్రంగానే సాగింది. ఈ ప్రమాదంపై ఎలాంటి నివేదిక బయటకు రాలేదు.
అంతా నిర్లక్ష్యమే…!
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణను వేగవంతం చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ విజిలెన్స్ అధికారులు విచారణలో వేగం పెంచారు. 2016లో మిడ్‌మానేరు ప్రాజెక్టు కొట్టుకుపోయేందుకు గల కారణాలపై విజిలెన్స్ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలను కలిగి ఉంది. డ్యామ్ నిర్మాణం చేపట్టే సమయంలో ఎర్త్‌బండ్ కన్నా స్పిల్‌వే ఎత్తు పెరిగిందని.. ఈ కారణం వల్ల వరద వస్తే ఆనకట్ట కొట్టుకుపోతుందని అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పట్టించుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం.
మిడ్ మానేరు ప్రోజెక్ట్ కట్ట కొట్టుకుపోవడానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఎంత ఉందో.. అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే ఉందని నివేదికలో విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఎర్త్బండ్కు 130 మీటర్ల మేర గండి పడి నష్టం జరిగింది. అయితే, అప్పటికే ఆ పనులను రూ.122.30 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారని, సంస్థను అంచనా వేయడానికి వ్యయాన్ని రూ.347 కోట్లకు ఒకేసారి పెంచేశారని ప్రాథమికంగా గుర్తించింది. నిర్మాణాల్లో నిర్లక్ష్యం, ఎత్తు పెంపుతో ప్రమాదాలపై విజిలెన్స్ సమగ్ర నివేదికల్లో వెల్లడించినట్లు తెలుస్తున్నది. కాగా ఇప్పటికే నివేదిక తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.
కేసీఆర్ కు నోటీసులు..?
మిడ్‌మానేరు విచారణలో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ విచారణకు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో అంచనాలు పెంచి ఆమోదం తెలిపారు. కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి.