Home తాజా వార్తలు కేసీఆర్ పేరు ఏడాది తర్వాత వినిపించదు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

కేసీఆర్ పేరు ఏడాది తర్వాత వినిపించదు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
కేసీఆర్ పేరు ఏడాది తర్వాత వినిపించదు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఆయన ఉనికి లేకుండా చేయడమే నా అభిమతం
  • కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేశా
  • తర్వాత హరీష్ ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు
  • ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్ల అవినీతిపై దర్యాప్తు సంస్థల నివేదికలను గూఢంగా చర్యలు
  • వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా
  • దీపావళి చిచ్చుబుడ్లకు బదులు కేటీఆర్ బావమరిది ఇంట్లో సారా బుడ్లు
  • దీపావళి దావత్ అలా కూడా చేస్తారా..?
  • రాజ్ పాకాల తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయిండు..?
  • ఆయన విల్లాలో క్యాసినో కైన్స్‌, విదేశీ మద్యం ఎందుకు దొరికింది..?
  • మూసీ పునరుజ్జీవంపై త్వరలో అఖిలపక్షం భేటీ
  • నవంబర్ 1 న మూసీ పునరుజ్జీవం పనులకు శంకుస్ధాపన
  • ఎస్టీపీ పనులకు 15 టెండర్లు
  • తొలిదశలో 21 కిలో మీటర్ల మేర అభివృద్ధి
  • గండిపేట,హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు రూపురేఖలు మారుస్తాం
  • బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణం
  • బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహం ఏర్పాటు
  • మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏడాది తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేరు వినిపించిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉనికి లేకుండా చేయడమే తన రాజకీయాల్లో అభిమతమన్న సీఎం..ఏడాదిలోగా కేసీఆర్ రాజకీయానికి ముగింపు పలుకుతానన్నారు.ఈ వ్యూహంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ నే పావుగా వాడానని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కేటీఆర్ ను రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్‌రావును వాడుకుంటానని స్పష్టం చేశారు. తర్వాత బావను ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలుసని చెప్పారు. చివరకు బావతో కేటీఆర్ రాజకీయం ముగుస్తుంది.

మంగళవారం సచివాలయంలో మీడియాతో చిట్‌ చిట్‌ చేసిన ఆయన రేవంత్‌ రెడ్డి పలు కీలక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయం కాలం చెల్లిన మందులాంటిదని సెటైర్లు వేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోంది. విచారణ సంస్థల రిపోర్టులనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సీఎం కావాలన్న తన కల నెరవేరిందన్న సీఎం దీనికంటే పెద్ద కలలేమీ తనకు అందజేసారు. ప్రస్తుతం ప్రజలకు మంచి చేయడమే నా కల, కర్తవ్యం అని అన్నారు. రైతులు, పేదలు, మహిళలు అందరూ సంతోషంగా ఉండాలన్నారు. రైతులు, మహిళలు ఆనందంగా ఉంటే ఆ రాజ్యం సంతోషంగా ఉన్నట్లే అని అన్నారు.

దీపావళి దావతా అలా కూడా చేసుకుంటారా..?

రాష్ట్ర రాజకీయాలకు కుదిపేసిన జన్మవాడలోని కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాంహౌస్ లో జరిగిన విందుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి అంటే చిచ్చుబుడ్లను చూస్తాం కానీ కేటీఆర్ బావమరిది ఇంట్లో సారా బుడ్లను చూశామన్నారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదని ఎద్దేవా చేశారు. రాజ్ పాకాల ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని.. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారని ప్రశ్నించారు.

దావత్ క్యా చేస్తేసినో కైన్స్‌, విదేశీ మద్యం ఎందుకు దొరికింది.ఆ విందులో పాల్గొన్న ఒకరికి కొకైన్ పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఆ కొకైన్ ఇచ్చింది రాజ్ పాకాలనేనని విజయ్ మద్దూరి చెప్పడంతో రాజ్ పాకాలను ఏ వన్ గా చేర్చిన గుర్తు చేశారు. తర్వాత వారి ఇళ్లల్లో సోదాలు చేశారనీ అదే వివాదం అయి ఉంది. తర్వాత రాజ్ పాకాల హైకోర్టులో పిటిషన్ వేయడంతో విచారణ హాజరయ్యేందుకు రెండు రోజుల పాటు హైకోర్టు ఇచ్చిందని చెప్పారు. రెండు రోజుల తర్వాత రాజ్ పాకాల పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉందనీ ఆయనకు డ్రగ్స్ తో పాటు విజయ్ మద్దూరికి ఇచ్చిన కొకైన్ ఎక్కడి నుంచి తెచ్చారో కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.

నవంబర్ ఒకటిన మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం..!

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగే కానీ,వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నవంబర్ 1న మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఎవ్వరు ఎంత అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించామనీ ఇప్పుడు వెనక్కి వెళ్లేది.మొదటి దశలో గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 21కి.మీ వరకు అభివృద్ధి చేస్తామన్నారు. ఆ నది పరివాహక ప్రాంతాలను ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తానని సీఎం దాని వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.నెల రోజుల్లో డిజైన్లు పూర్తి అవుతాయన్నారు.

మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని చెప్పిన సీఎం దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామన్నారు.బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.అక్కడ బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణాన్ని చేపడతామన్నారు. 15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామన్నారు. మూసి ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే రూ.140తో డీపీఆర్ తయారీకి సిద్ధమైంది. మూసీ నిర్వాసితులకు ఉచితంగా విద్య, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూసీ కోసం భూములు ఇచ్చే వారికి వంద శాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. మూసీ కోసం ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమని ప్రకటించారు.

మూసీ ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం లేదని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. కేటీఆర్‌ ప్రపంచ స్థాయి మేధావినని అనుకుంటున్నారని, మూసీని బాగుచేసే అంశంలో కేటీఆర్‌ తన ఆలోచనలు చెప్పొచ్చని సూచించారు.ఈ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ నేతలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సీఎం తెలిపారు. తనను నేరుగా కలవడానికి, తనను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలకు అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి తమ అభ్యంతరాలు చెప్పుకున్నారు. మూసీ పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధంగా ఉన్న ఆయన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

కేటీఆర్, హరీష్ రావు కూడా తనతో కలిసి రావాలని సవాల్ విసిరారు. పాదయాత్రలోనే మూసీని అభివృద్ధి చేస్తున్నారో లేదో ప్రజలను అడుగుదామని. మూసీ పునరుజ్జీవంపై కావాల్సిన చర్చకు తెరలేపానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చర్చతో ప్రజలకు అవగాహన కల్పించారు. మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు తెలిసిందని అన్నారు. తాను ఫుట్‌బాల్ ప్లేయర్‌నని, గేమ్ ప్లాన్‌పై తనకు పూర్తి స్పష్టత ఉందని. 55 కి.మీ. మూసీ పునరుజ్జీవం పూర్తి అయితే అద్భుత నగరం ఆవిష్కృతమవుతుందని, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రానికి 65 శాతం ఆదాయం వస్తోందని, మరింత పెంచుతామని వివరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech