- ఇప్పటికైనా ఉప ఎన్నికల జపాన్ని మానండి
- ఫాంహౌస్ ఉండేది కేసీఆరైతే, ప్రజల మధ్య ఉండేది కాంగ్రెస్
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఉప ఎన్నికల పిచ్చి పట్టిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. అధికారంలో ఉంటే ఫాంహౌస్, అధికారం లేకపోతే ఉప ఎన్నికలు ఇది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమని ఆయన అన్నారు. ప్రతి పక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం, అధికారంలో ఉంటే ప్రజా సమస్యలపై ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమని అన్నారు.
ఇప్పటికై బీఆర్ఎస్ ఉప ఎన్నికల జపాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. గత పదేళ్లలో ప్రజల మధ్య కేసీఆర్ ఏనాడూ లేరని, అందుకే బీఆర్ఎస్ ఓడించి కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారని అన్నారు. ప్రజలకు మెచ్చే పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుంది. పదేళ్ళలో బీఆర్ఎస్ నేతలు చేయలేని రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ ఎనిమిది నెలల్లో ఒకే కిస్తీలో రుణమాఫీ చేసింది. అందుకే బీఆర్ఎస్ నేతలు తమ పాలనను చూసి ఏడుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం గాంధీభవన్ లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు.. ప్రజలకు సీఎం అందుబాటులో ఉండే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ చేశారన్నారు. ముఖ్యమంత్రి , మంత్రులు సచివాలయంలో నిత్యం ఉంటున్నారని అన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో చోటుచేసుకున్న లోపాలను సవరించుకుంటూ 8 నెలలుగా కాంగ్రెస్ పాలన సాగిస్తోందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 2లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేశామన్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు రైతులను అయోమయానికి గురి చేసేందుకు జగ్గారెడ్డి ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని ఆయన చెప్పారు.