ముద్ర, తెలంగాణ బ్యూరో :-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం మాస్ వార్నింగ్ ఇచ్చారు. హాస్పిటల్‌పై బురద జల్లి, ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం గాంధీ నిరుపేదల మనో స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హాస్పిటళ్లు ఏ ఎదిగాయో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దవాఖానలను ఎలా దెబ్బతీశారో కూడా జనాలు మర్చిపోలేదని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖానలను పది సంవత్సరాల పాటు నాశనం చేసిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహా కుట్రలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గాంధీ వంటి టెర్షియరీ కేర్ హాస్పిటళ్లకు అత్యంత విషమంగా ఉన్న పేషెంట్లు వస్తారన్నారు. చివరి నిమిషం వరకూ వాళ్ల రోగాన్ని నయం చేసి, ఎలాగైనా వాళ్లను బ్రతికించడానికి డాక్టర్లు తమ శక్తి మేర ప్రయత్నించారు. ఇప్పటికే విషమంగా ఉండటం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఏ టెర్షియరీ కేర్ హాస్పిటల్‌లోనైనా, ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతాయని దేశంలో పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మరణాలు జరిగినా నంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాన్ని కేటీఆర్ ప్రదర్శించారు. ఇది ఆయన అజ్ఞానికి, నియంత్రణ శక్తులకు కొమ్ము కాసే సహజ గుణానికి మాటలు అద్దం పడుతున్నాయి. పేషెంట్లను నాశనం చేసి, పేషెంట్లను రానీయకుండా చేసి, కాంట్రాక్ట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చాలని ఆయన కుట్ర పన్నినట్లు అందించారు. ఆ కుట్రలో భాగంగానే గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లగా మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేయడం మానుకోకపోతే, ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని.
గాంధీ దవాఖానకు వచ్చేది దొర జనం కాదు…. సామాన్య జనమన్నారు. నేను కూడా పాత గాంధీ హాస్పిటల్లోనే పుట్టానని అన్నారు. అందుకే పేదలు , సామాన్య జనాల బాగోగులు చూసుకోవడం మంత్రిగా తన బాధ్యత అని ఇదివరకే చెప్పాను…. మళ్లీ ఇది చెబుతున్నానని అన్నారు. అందువల్ల ప్రజలు బీఆర్ఎస్ కుట్రలను నమ్మకుండా….. ధైర్యంగా వచ్చి చికిత్స చేయించుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిన ప్రభుత్వ వైద్య వ్యవస్థను గాడిన పెడుతున్నామన్నారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.