34
కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫాం ల నుంచి తొలగించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కోర్టు సీరియస్ అయింది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేయరాదని మంత్రిని హెచ్చరించింది.