గ్రామాల్లో వివిధ సమస్యలతో జనం అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే మాత్రం అటువైపు తొంగిచూడడమే లేదని బీజేపీ గంభీరావుపేట మండల నేతలు కేటీఆర్ పై మండిపడుతున్నారు. కేటీఆర్ తీరుకు నిరసనగా తమ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కోడె రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని, జనం నిత్యం సతమతమవుతున్నారని తెలిపారు. తమ అవస్థలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరిస్తాడని నమ్మి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కేటీఆర్ మాత్రం అటువైపు చూడడమే.
గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని. కేటీఆర్ కు రాజకీయంగా జన్మనిచ్చిందే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలని గుర్తుచేసిన బీజేపీ నేత.. ఇప్పుడు ఆ నియోజకవర్గాన్నే కేటీఆర్ గాలికి వదిలేశాడని గుర్తు చేశారు. గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించినట్లు గతంలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఆర్భాటం చెబుతున్నారు. ఈ ఉంటేనే తమ ఎమ్మెల్యే నిత్యం మీకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.