Home తాజా వార్తలు కేటీఆర్ అరెస్టు వైపు అడుగులు…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

కేటీఆర్ అరెస్టు వైపు అడుగులు…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
కేటీఆర్ అరెస్టు వైపు అడుగులు...! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • త్వరలో పోలీసుల అదుపులో కేటీఆర్..?
  • ముమ్మరంగా అడుగులేస్తున్న సర్కార్
  • నగరంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలుకు కారణమైంది
  • గతంలో ఎప్పుడు లేని విధంగా పోలీసుల ఆంక్షలు
  • గవర్నర్, సీఎం నివాసం, సెక్రటేరియట్, డీజీపీ ఆఫీసుకు భద్రతా పెంపు
  • చరిత్రలో తొలిసారిగా సెక్రటేరియట్ ఉద్యోగులకు చీఫ్ ఆఫీసర్ సర్క్యులర్
  • విధుల పట్ల నిర్లక్ష్యం వద్దంటూ సచివాలయ ఉద్యోగులకు హెచ్చరికలు
  • కేటీఆర్ అరెస్టుకు సర్కార్ సంకేతాలు
  • నవంబర్ 1 నుంచి 8 వరకు అరెస్టు పర్వం..?
  • నిఘా విభాగాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
  • కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ వరుస హెచ్చరికలు
  • పరిగణలోకి న్యాయసలహాలు.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు
  • నేడో రేపో గవర్నర్ అనుమతి కోసం సర్కార్ నిర్ణయం

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆయన అరెస్టుకు ముందు తర్వాత తలెత్తే పరిణామాలు అంతే కాకుండా అరెస్ట్ కు సంబంధించి ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు, కీలక నేతలు అరెస్టుపై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత రాకుండా వారికి కారణాలను సమగ్రంగా వివరించేందుకు సమాయత్తమవుతున్నారు.

ఈ విధంగా వ్యూహాత్మకంగా ముందుకువెళ్తున్నారు. కేటీఆర్ అరెస్టుతో రాష్ట్ర రాజధానిలో జరిగిన పరిణామాలపై ఇటీవల రహస్యంగా సమావేశమైన రాష్ట్ర ఏర్పాటు, ప్రభుత్వ పెద్దలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యువనేత అరెస్టుతో గులాబీ శ్రేణులు, నాయకులు రాష్ట్ర రాజధానిలో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలకు దిగే అవకాశం నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న సర్కార్‌ ముఖ్యంగా శాంతిభద్రతల సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

ఇందులో భాగంగానే బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద నగరంలో ఈ నెల 27 నుంచి నెల రోజుల పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో 144 సెక్షన్ అమలు జారీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు అంతరాయాన్ని కలిగించే విధంగా బహిరంగ సభలు, ధర్నాలు, నిరసనలు, చిహ్నాలు, సందేశాల ప్రదర్శనను నిషేధించింది. వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రదర్శనలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ ఆనంద్ తెలిపారు. అయితే శాంతియుత ధర్నాలు,నిరసనలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అనుమతిస్తామని. ఈ విషయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రత్యేకంగా సెక్రటేరియట్, ఇతర సున్నితమైన ప్రాంతాల వద్ద నిరసనలకు చర్యలు తీసుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేటీఆర్ అరెస్టుపై సర్కార్ సంకేతాలు..!

బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఎన్నికలు, మతపర ఘర్షణలు, విద్రోహ శక్తుల దాడుల ఆస్కారం లేని సమయంలో చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాజధానిలో ఆకస్మికంగా నెల రోజుల పాటు 144 సెక్షన్, ఇతర ఆంక్షలు విధించడం వల్లే ప్రభుత్వం త్వరలోనే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందని తెలిసింది. మరోవైపు కేటీఆర్ అరెస్టుతో ఆ పార్టీ శ్రేణులు సీఎం నివాసం, సెక్రటేరియట్, డీజీపీ ఆఫీసుపై దాడులకు దిగే ఆస్కారం ఉందని ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుకున్న సర్కార్ వీటితో పాటు గవర్నర్ నివాసానికీ భద్రతా నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఈ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరోక్షంగా ధృవీకరించారు. కొన్ని గ్రూపులు వాటిపై ఆకస్మిక దాడులు, నిరసనలకు దిగే ప్రమాదముందన్న ఇంటిలిజెన్స్ సమాచారంతోనే ఆంక్షలు విధించినట్లు తెలిపారు. మరోవైపు.. రాష్ట్రంలోనే చోటుచేసుకున్న కీలక పరిణామాలపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉంటూ ఇతర సమాచారం అందించాలని సర్కార్ నిఘా విభాగాలను పరిశీలించింది. దీనితో పాటు విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. ఆందోళనకారులకు ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలంటూ చరిత్రలో తొలిసారిగా సెక్రటేరియట్ చీఫ్ ఆఫీసర్ అందులో పని చేస్తున్న ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

నవంబర్ ఫివర్..!

గత కొంతకాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి నవంబర్‌ 2018న ఎన్నికలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్, భూ అక్రమాల్లో జరిగిన అవినీతిపై చర్యలకు ఉపక్రమించిన కాంగ్రెస్ సర్కార్లలో ఏదో ఓ అంశంలో కేటీఆర్ ను బాద్యుడిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ పలువురు మంత్రులు, కలిసి ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అక్కడ దీపావళిలోపు రాష్ట్రంలో బాంబు పేలుతాయంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఇటు రెండ్రోజుల క్రితం ఢిల్లీకి పీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెళ్లి రాజకీయాలపై అగ్రనేతలతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్, ఆయన తనయుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అవినీతి, అక్రమాలకు పదేళ్ల జైలు శిక్ష కూడా తగ్గేనంటూ, వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను మరింత హీటెక్కించాయి. మరో మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా ఈ నెల 26న హైదరాబాద్ శివారులోని జన్వాడలోని కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్ పై దాడి చేసిన పోలీసులు అక్కడ రేవంత్ పార్టీ జరిగిందనీ, అందులో రాజ్ పాకాల ఉద్యోగి విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారించడం రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసింది. తీవ్ర చర్చకు దారితీసిన ఈ వరుసగా పరిణామాలపై ప్రభుత్వం ఏ అంశంపై చర్యలు తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీయగా.. ఎప్పుడు ఏ సమయంలో ఎవరిపై ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.

నవంబర్ 1 నుంచి 8 వరకు అరెస్టు..?

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు ప్రభుత్వం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ప్రతిపక్షానికి చెందిన కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురు కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో కొనసాగుతున్న వీరందరూ నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ అప్పటి ఇంటలిజెన్స్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆధారాలు సేకరించిన ప్రభుత్వం త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసుల జాబితాలో ఉమ్మడి పాలమూరు, మెదక్, నల్గొండ కు చెందిన కీలక నేతల పేర్లు తెలిసింది. ఈ ఇప్పటికే ఆయా జిల్లాలతోపాటు ఇంటిలిజెన్స్ విభాగాలను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

దాడుల భయంతోనే ఆంక్షలు : సీవీ ఆనంద్

నగరంలో ఆంక్షలకు సంబంధించి నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో ఆంక్షలు విధించడంపై ఓ నెటిజన్ సీపీ సీవీ ఆనంద్ ట్యాగ్ చేస్తూ వేదికగా విమర్శలు చేశారు. “ప్రభుత్వం భయపడుతుందా? నగరంలో సమావేశాలు, ప్రజల సమూహం లేకుండా 144 సెక్షన్లు నడుస్తున్నాయి. వాహ్ ప్రభుత్వానికి గొప్ప పని” అని ట్వీట్ చేశారు. నెటిజన్ వేడుకలకు బదులు ఇచ్చిన సీపీ ఆనంద్… ఈ నోటిఫికేషన్‌కు దీపావళి పండుగకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనేక ఆందోళనలు, సచివాలయం, సీఎం నివాసం, డీజీపీ, రాజ్‌భవన్ మొదలైన వాటిపై ఆకస్మిక దాడులు, నిరసనలకు కొన్ని గ్రూపులు ప్లాన్ చేసే రకాల సమాచారంతో వీటిని కట్టడి చేసేందుకు, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ నోటిఫికేషన్‌లు ఇచ్చారు. ఇలాంటి చర్యలు అవసరమని పోలీసులు సాధారణంగా అమలు చేస్తున్నారు అని స్పష్టత ఇచ్చారు. తప్పుడు ప్రచారం ఇది కర్ఫ్యూ కాదని వివరణ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech