Home తాజా వార్తలు కేటీఆర్ అక్కసులో అర్దం లేదు – రాష్ట్ర మంత్రి సీతక్క – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

కేటీఆర్ అక్కసులో అర్దం లేదు – రాష్ట్ర మంత్రి సీతక్క – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
కేటీఆర్ అక్కసులో అర్దం లేదు - రాష్ట్ర మంత్రి సీతక్క - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మూసీ ప్రక్షాళన పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు యూటర్న్ డ్రామాలు
  • హైదరాబాద్ కు పురుడు పోసిన మూసీకి పునరుజ్జీవం పోవడం మన విధి
  • మృత్యుఘోష నివారణకు ఇదే మార్గం
  • మూసీ పున‌రుజ్జీవ యజ్ఞంలో ఎవ‌రికీ నష్టం జరగనివ్వం
  • ప్రజాలు స్వచ్చందంగా తరలుతుంటే విపక్షాలకు చెమటలు పడుతున్నాయి

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ న‌ది పున‌రుజ్జీవం పై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోప‌ణ‌ల్లో ప‌స లేద‌ని, ఆయన అక్కసులో అర్దం లేద‌ని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క మండిప‌డ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మూసీ పున‌రుజ్జీవన’ ప్రాజెక్టును మొద‌ట్లో వ్యతిరేకించిన కేటీఆర్.. ఇప్పుడు ప్రజాగ్రహానికి త‌లొగ్గి తాము వ్యతిరేకం కాద‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నార‌ని, పిల్లి మొగ్గ‌లు వేస్తున్నార‌ని ఎద్దేవా చేసారు. మూసీ డీపీఆర్ ఎప్పుడో సిద్దం చేసామ’ని చెబుతున్న కేటీఆర్ పదేండ్లుగా అధికారంలో ఉండి మూసీ నీటిని క‌నీసం ఎందుకు శుద్ది చేయ‌లేక‌పోయార’ని ప్రశ్నించారు. నిజంగా మూసీ ప్రక్షాళన పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, అభూత కల్పనలకు, ఆకాశానికి నిచ్చెనలు చిత్రీకరణలో కేటీఆర్ దిట్ట అని పేర్కొన్నారు. ఏలాంటి డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం పేరుతో ల‌క్ష కోట్లను గోదారి పాలు చేసిన బీఆర్‌ఎస్ నేత‌ల‌కు, డీపీఆర్ గురించి మాట్లాడే క‌నీస అర్హత లేద‌న్నారు.

తామే మూసి ప్రక్షాళనను మొద‌లు పెట్టామ‌ని ఓ వైపు గొప్పగా చెబుతూనే మ‌రో వైపు మూసీ పున‌రుజ్జీవన‌ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో కేటీఆర్ చెప్పాల‌ని డిమాండ్ చేసారు. కాల‌మైతే మీ ఖాతాలో, క‌రువొస్తే ప‌క్కడి ఖాతాలో వేసే విధానాన్నిమానుకోవాల‌న్నారు. ఒకప్పుడు నాంపల్లి, ఖైరతాబాద్ మండలాలకే పరిమితమైన హైదరాబాద్ నగరాన్ని నలదిక్కులా విస్తరించి విశ్వనగరంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదే అని తెలిపారు. వండిన కుండలాంటి హైదరాబాద్ ను వడ్డించుకు తిన్నది టిఆర్ఎస్ నేతలు కాదా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. రాజధాని హైదరాబాద్ నగరానికి పురుడు పోసిన మూసీని కాపాడుకోవ‌డానికి త‌మ ప్రజా ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని మంత్రి సీత‌క్క పున‌రుద్ఘాటించారు.

మూసీ కి పున‌రుజ్జీవం పోసే మహా యజ్ఞంలో ఎవ‌రికి అన్యాయం జ‌ర‌గ‌ద‌ని నిల్వ. మూసీ నదీ గర్భంలో ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని ఒప్పించి మెప్పించి అన్ని రకాలుగా చేయూతనిచ్చి మరో చోట వాళ్లకు స్థిర నివాసం ఏర్పాటు చేసి, పునరావాసం కల్పించిన తర్వాతే ఇండ్లు ఖాళీ చేస్తున్నాం. ప్రజా ప్రభుత్వంపై నమ్మకంతో మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలోని ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్తుంటే..కేటీఆర్ త‌ట్టుకోలేక పోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మంత్రి సీత‌క్క మండిప‌డ్డారు. మూసీ ప్రాంత ప్రజల బాధలు ప‌ట్టని కేటీఆర్.. మిట్ట మీద ఎన్ని ప్రదర్శనలైనా ఇస్తారని ఎద్దేవ చేసారు. 2020 లో హైదరాబాద్ లో వర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా 33 మంది మృత్యువాత ప‌డ్డార‌ని సీత‌క్క గుర్తు చేసారు. ఇలాంటి మృత్యుఘోష పునరావృతం కాకుండా శాశ్వత ప‌రిష్కార మార్గం చూపెందుకే మూసీ పున‌రుజ్జీవనానికి పూనుకున్నామ‌ని మంత్రి సీత‌క్క అన్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మూసీ ని బ‌లిపెట్టొద్ద‌ని నిర్ణ‌యించారు. మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టుల్లో ప్రతిప‌క్షంగా స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తే స్వీక‌రిస్తామ‌ని, అలా కాకుండా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చిల్లర మ‌ల్ల‌ర రాజ‌కీయాలు చేస్తే ప్ర‌జ‌లే బుద్దిచెబుతార‌ని మంత్రి సీత‌క్క హెచ్చరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech