ముద్ర, తెలంగాణ బ్యూరో :-ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మను ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి) ఆదివారం రాత్రి ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ భారత దేశంలోనే నెంబర్ వన్ క్లబ్ గా ఫిల్మ్ నగర్ క్లబ్ కి పేరు వుందని ప్రశంసించారు. ఎఫ్ సి ఎన్ సి ఎప్పుడూ మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు, నేషనల్ గేమ్స్, వివిధ కార్యక్రమాలు చేస్తూ క్రీడాకారులను, కళాకారులను ఎంకరేజ్ కొనియాడారు. ఈ సంస్థ ఇలాగే అంచలంచెలుగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ తన వంతు సహాయం ఎప్పుడు కావాలన్న క్లబ్ కి అందిస్తానని హామీ ఇచ్చారు.
ఎఫ్ ఎన్ సి సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ మాట్లాడుతూ ప్రజా సేవలో ఎంతో కొంత ఉండి కూడా తమ సత్కారాన్ని స్వీకరించినందుకు రాజు శ్రీనివాస్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్ ఎన్ సి సంస్థ చేసే కార్యక్రమాలను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఎఫ్ ఎన్ సి సి సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్, జైంట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, జే. బాలరాజు గారు, ఏడిద రాజా గారు, సామ ఇంద్రపాల్ రెడ్డి గారు,మరియు ఎఫ్ . ఎన్.సి.సి ఫార్మర్ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఈ ప్రముఖ అతిథులుగా సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ , తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ టి. ప్రసన్నకుమార్ మరియు క్లబ్ సభ్యులు.