Home తెలంగాణ కుల గణనకు సిద్ధమైన ప్రణాళిక విభాగం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

కుల గణనకు సిద్ధమైన ప్రణాళిక విభాగం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
కుల గణనకు సిద్ధమైన ప్రణాళిక విభాగం - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • సమగ్రంగా సర్వే
  • 54 అంశాలతో ఆకృతి
  • ఆస్తులు, పదవులు.. వ్యాధులు.. అన్నీ సేకరణ
  • మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే..!

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే కులగణన కోసం ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఇప్పటికే 54 ప్రశ్నల శాఖలతో 7 పేజీలను రూపొందించిన ప్రణాళిక.. ఇందులో ఆస్తులు, రిజర్వేషన్ల ద్వారా లబ్దిపొందిన వివరాలను సేకరించేలా కొత్త ఫార్మాట్ తయారు చేసింది. ప్రతి కుటుంబ సమగ్ర ప్రశ్న సేకరించేలా 54తో 7 పేజీల ఫార్మాట్‌ను అధికారులకు జారీ చేసింది. ఈ మేరకు ఇంటి నంబర్లకు ప్రత్యేక కోడ్ కేటాయించి పూర్తి చేయడానికి నమోదు చేసేలా ప్లాన్ చేస్తోంది.

ఎలా.. ఏంటీ..?

రాష్ట్ర ప్రభుత్వం కుల గణనకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా ఏ కులం జనాభా సంఖ్య ఎంత ఉంది? వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, ఇంకా అందించాల్సిన పథకాలు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాల ఫోకస్ చేస్తూ వచ్చేనెల నుంచి సమగ్ర కులగణనను చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్థారణకు తగ్గ ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. ఈ సర్వే కోసం అవసరమైన 3 వేల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ షెడ్యూల్ కూడా పూర్తి చేసింది. ఈ గణన సందర్భంగా సిబ్బంది 15 రోజుల పాటు క్షేత్ర స్థాయిలోనే ఉండనున్నారు. ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించారు. ఇలా రాష్ట్రంలోని.10 కుటుంబాల నుంచి వివరాలు సేకరించబడ్డాయి. ఈ కులగణనలో మొత్తంగా 54 ప్రశ్నలకు వివరాలు సేకరించనున్నారు. ఇందులో సగం కుటుంబ నేపథ్యంపై ప్రశ్నలు ఉండగా.. మిగిలిన సగం వ్యక్తిగత వివరాలకు సంబంధించినవని. తినే తిండి నుంచి మొదలుకునిప్రభుత్వం అమలు చేస్తున్న ఏయే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇంటి యజమాని ఏంటి, ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత అనే ప్రశ్నలన్నీ ప్రజలను అడగనున్నారు.

గత బీఆర్ ఎస్ సర్కారు 2014లో సమగ్ర సర్వే చేసి వివరాలు గోప్యంగా ఉంచడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కులగణనలో ఎలాంటి వివాదాలు, ఆరోపణలు రాకుండా పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ అంశంలో సామాజికవేత్తలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. వారి నుంచి తగు సూచనలు, సలహాలు కూడా స్వీకరించింది. అదే సమయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన సాఫీగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.

బీసీల లెక్కలే ముఖ్యం

వారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల ఎందరనే లెక్కల కొసమేఈ సర్వే చేపడుతోందని తెలుస్తోంది. వాళ్లతో పాటు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరి కులం, ఉపకులం ఏంటి, స్థానికంగా కులాల పేర్లలో ఏమైనా మార్పులు జరిగేలా ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరిస్తారు. ఎవరిదైనా కులం పేరు తప్పుగా నమోదైతే భవిష్యత్తులో అనేక రకాలుగా నష్టం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తప్పుడు వివరాలు నమోదు కాకుండా స్థానిక అధికారులు పటిష్టంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగానే భవిష్యత్తులో సంక్షేమ పథకాలతో పాటు అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రతీ ఒక్కరి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, మొబైల్ నంబర్లతో వివిధ వివరాలను నమోదు చేస్తారు. విద్యార్హత, ఉద్యోగం, సొంత ఇల్లు, కారు , బైకు స్థిర ఉన్నాయా అని ఇలా పూర్తి స్థాయిలో సేకరించారు. జనాభా లెక్కలకన్నా ఎక్కువ ఈ సర్వే నుంచి ప్రభుత్వం ఫలితాలు సాధించింది.

రాష్ట్రంలో 3.80 కోట్లకు పైగా జనాబా

ప్రస్తుతం 3.80 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. మొత్తం కుటుంబాల సంఖ్య 1.10 కోట్లు దాటిందని అంచనా. తగ్గట్టుగానే సిబ్బంది నియామకానికి ప్రణాళికాశాఖ ప్రతిపాదనలు రూపొందించబడ్డాయి. అయితే ప్రతి 150 కుటుంబాలకు ఓ సర్వే గణకుడిని నియమిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 75 వేల మంది అవసరం ఉంటుంది. వీళ్లపై పర్యవేక్షకులుగా మరో 15 వేల మంది వరకు అవసరం అవుతుంది. వీళ్లందరినీ నియమించేందుకు అన్ని శాఖల సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులను ఇలాంటి సర్వేలకు పంపించామని గతంలో కోర్టు తీర్పులున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖలోనే టీచర్లు కాకుండా 15 వేల మంది ఇతర ఉద్యోగులను ఈ సర్వే కోసం నియమించారు. జిల్లాల్లో కుటుంబాల సంఖ్య ఆధారంగా కనీసం 2500 నుంచి 3 వేల మంది ఉద్యోగులను అన్ని శాఖల నుంచి ఈ సర్వే కోసం పంపిస్తారు. వీళ్లందరూ కూడా 15 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. ఒకసారి సర్వే పూర్తయ్యాక వివరాలు పక్కాగా సేకరించారా లేదా అని కూడా ఆ తర్వాత తనిఖీ చేయడం కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ నెలాఖరులోగా సర్వే ప్రారంభించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 60 రోజుల్లో సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

దశల వారీగా..!

ఈ వివరాల సేకరణలో భాగంగా మొదటి దశలో కుటుంబ సభ్యుల సంఖ్య సేకరిస్తారు. ఆ తర్వాత కుటుంబ యజమాని, సభ్యులు, యజమానితో సంబంధం, జెండర్, మతం, కులం/సామాజిక వర్గం, ఉప కులం, కులానికి సంబంధించిన ఇతర పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్ నంబర్‌ను సేకరించారు. ఇక, రెండో దశలో ఓటర్ ఐడీ కార్డు. దివ్యాంగులైతే దాని పూర్తి వివరాలు. మ్యారిడ్, అన్ మ్యారిడ్. వివాహ కాలం నాటికి వయసు, ఆరేళ్ల వయసులోపు పాఠశాలలో చేరారా లేదా?, ఏ పాఠశాల. విద్యార్హతలు, 6–16 ఏళ్ల మధ్య బడి మానేస్తే ఆ సమయానికి చదువుతున్న తరగతి, బడి మానేయటానికి కారణాలు, 17–40 ఏళ్లలోపు వారు విద్యను కొనసాగించకపోవడానికి గల కారణాలు, నిరక్షరాస్యులవడానికి గల కారణాలను వివరిస్తారు.

మూడో దశలో ప్రస్తుతం చేస్తున్న వృత్తి, స్వయం ఉపాధి. దాని వివరాలు. రోజువారీ వేతనం ఎంత? ఏ రంగంలో పనిచేస్తున్నారు?. కులవృత్తి ఏమిటి, ప్రస్తుతం కులవృత్తిని కొనసాగిస్తున్నారా? కులవృత్తి కారణంగా వ్యాధులబారినపడ్డారా?. వార్షికాదాయం, ఆదాయ పన్ను కడుతున్నారా?, బ్యాంకు ఖాతా ఉందా లేదా? అధ్యయనం తీసుకుంటారు. ఇక, నాలుగో దశలో రిజర్వేషన్ ద్వారా లబ్ది పొందిన విద్య ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన కుల ధ్రువీకరణ పత్రం ఉందా? లేదా?. సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందిన వార?, రాజకీయ నేపథ్యం ఏమిటి?, ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు?. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధిగా పనిచేశారు. నామినేటెడ్‌ లేదా కార్పొరేషన్‌ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థలలో సభ్యులుగా ఉన్నారా? నమోదు రికార్డు చేయనున్నారు. ఐదో దశలో కుటుంబం పేరుమీద ఎంత భూమి ఉంది. ధరణి పాస్‌బుక్, పాస్‌బుక్ నంబర్, భూమిరకం వివరాలు.

తర్వాత ఆ భూమి వారసత్వమా? సొంతంగా కొన్నదా? బహుమతిగా వచ్చిందా?, అసైన్డ్ భూమా? అనే వివరాలు. అలాగే భూమికి ప్రధాన వనరులు, పంటలు పండు, ఏమైనా రుణాలు తీసుకున్నారా?, ఏ అవసరం కోసం ఎన్ని కోసం?, ఎక్కడి నుంచి తీసుకున్నారు?, వ్యవసాయ అనుబంధంగా ఎవరైనా పనిచేస్తున్నారా? అనే వివరాలు తీసుకుంటారు. ఆరో దశలో ఆకుటుంబానికి చెందిన పశుసంపద వివరాలను కూడా రికార్డుల్లో పొందుపరచనున్నారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతులు, ఇతరత్రా పెంపుడు జీవులను సైతం లెక్కించనున్నారు. వాటినుంచి వచ్చే ఆదాయం? ప్రభుత్వం సహాకారంపై ఆరాతీయనున్నారు. ఇక, ఏడో దశలో కుటుంబ ఆస్తులకు సంబంధించి.. స్థిర, చరాస్తుల వివరాలు. ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాస గృహం రకం, మరుగుదొడ్డి, వంట కోసం ఉపయోగించే ఇంధనం, ఇంటికి విద్యుత్‌ సదుపాయం వంటి వివరాలను సేకరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech