Home తెలంగాణ కురిమూర్తి స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

కురిమూర్తి స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
కురిమూర్తి స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర, తెలంగాణ బ్యూరో :-రాష్ట్రంలో ప్ర‌సిద్ధ క్షేత్ర‌మైన శ్రీ కురుమూర్తి స్వామి జాత‌ర‌కు వెళ్లే భ‌క్తుల సౌక‌ర్యార్థం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను టిజి ఆర్టీసీ న‌డుపుతోంది. జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన ఉద్దాల ఉత్స‌వం ఈ నెల 8వ తేదిన ఉండ‌గా.. 7 నుంచి 9వ తేది వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా రోజుల్లో ప్ర‌త్యేక బ‌స్సులను హైద‌రాబాద్ నుంచి సంస్థ అందుబాటులో ఉంచుతోంది. ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘ‌ర్, మ‌హ‌బూబ్న‌గ‌ర్ మీదుగా జాత‌ర‌కు వెళ్తారు. ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను సంస్థ క‌ల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఈ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఉప‌యోగించుకుని సుర‌క్షితంగా శ్రీ కురుమూర్తి స్వామిని ద‌ర్శించుకోవాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech