ముద్ర, తెలంగాణ బ్యూరో : కుటుంబాలను వీధుల్లోకి లాగి , శిఖండీ రాజకీయాలు చేయవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ హితవు పలికారు. కొండకు తవ్వితే సీఎం రేవంత్ రెడ్డికి చివరకు ఎలుక కూడా దొరకలేదని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్ పాకాల తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి విందు చేసుకుంటుంటే, 300 మంది పోలీసులతో వాళ్ల ఇంటిపై దాడి చేసి, ఆ విందును రేవ్ పార్టీగా చిత్రీకరించడం, వాళ్లుంటున్న ఇంటిని ఫామ్హౌస్గా చూపించడం, పైగా ఆ విందును కేటీఆర్కు అంటగట్టడం రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన చెప్పారు.
ఈ మేరకు ఆదివారం బీఆర్ఎస్ భవన్లో మీడియాతో దాసోజు శ్రవణ్ మాట్లాడారు.. డ్రగ్స్, రేవ్ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజా సమస్యలను, ప్రభుత్వ అవినీతిని మరుగున పెట్టేందుకు చిల్లర ప్రయత్నం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రతిపక్ష నాయకుల కుటుంబసభ్యులను, వాళ్ల వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగుతూ, హోదాను కించపరుస్తున్నారు. ఇవే ప్రభుత్వ ప్రాధాన్యతలు అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండటం ఆయన కురుచ మనస్తత్వానికి, చిల్లర రాజకీయాలకు నిదర్శనమని. సందట్లో సడేమియా లెక్క కొంతమంది కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు అవివేకంతో కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులపై పనికిరాని ఆరోపణలు ఉన్నాయని దాసోజు శ్రవణ్ అన్నారు. పనికిరాని ఆరోపణలు చేస్తూ శునకానందం పొందడం.