41
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయంలో శ్రీ శారదీయ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తొమ్మిదో రోజున అమ్మవారిని కాళరాత్రి దేవిగా అలంకరించారు. ఉదయాన్నే పూజలు నిర్వహించి కిచిడి నైవేద్యంగా సమర్పించారు.
కాగా ఇదే రోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రావడంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లతో పాటు పలు పొరుగు రాష్ట్రాల భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. తెల్లవారు ఝాము నుంచే అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజకు భక్తులు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆలయ ఈ ఓ విజయ రామారావు ఆక్షేపణ చర్యలు భక్తులకు. శాంతి భద్రతలను ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆబ్కారీ ఎస్పీ అవినాష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.