19
- సెప్టెంబర్ 13 ప్రారంభించనున్న ప్రధాని మోడీ
ముద్రణ, తెలంగాణ బ్యూరో : కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి భారతీయ జనౌషది కేంద్రాన్ని ఈనెల 13న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రిమోట్ వీడియో ద్వారా లింక్ కాచిగూడ రైల్వే స్టేషన్ తో సహా దేశవ్యాప్తంగా 18 ప్రదేశాలలో ప్రధాని మోడీ జనౌషధి కేంద్రాలను ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ తదితర ప్రముఖులు పాల్గొంటారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన జనౌషది వైద్య అత్యవసరమై మందులు సహా ప్రథమ చికిత్సకు సంబంధించిన ఔషదాలు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.