ముద్రణ ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా గోపాల్ పేట ఏదుట్ల గ్రామానికి చెందిన నరెడ్ల సాయిరెడ్డి అనే రైతు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఫిర్యాదు చేయడానికి కార్యాలయానికి వచ్చాడు. మనస్థాపానికి గురైన రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల ఉన్న ఫిర్యాదుదారులు వెంటనే అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. రైతు సాయి రెడ్డి కి ముగ్గురు అన్నదమ్ములు కాగా ఇతనికి ఉన్న భూమికి దారి వదలకుండా, నీళ్లు వదలకుండా సోదరులు ఇబ్బందులకు గురి చేశారు, అనేకసార్లు పోలీస్ స్టేషన్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు. తన సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని.
పరామర్శించిన మాజీ మంత్రి …
ఆత్మహత్యాయత్నానికి శాఖి జిల్లా వైద్యని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు సాయి రెడ్డిని సోమవారం సాయంత్రం మాజీ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అధికారులు రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యులు రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని.