Home తాజా వార్తలు కనుసన్నల్లోనే..!! దాడి వెనక పట్నం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

కనుసన్నల్లోనే..!! దాడి వెనక పట్నం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
కనుసన్నల్లోనే..!! దాడి వెనక పట్నం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • పట్నం నుంచి కేటీఆర్ కు సమాచారం
  • వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో విస్తుపోయే నిజాలు
  • ప్రధాన నిందితుడికి గులాబీ నేతలతో సంబంధాలు
  • ఘ‌ట‌న‌కు ముందు నుంచి మాజీ ఎమ్మెల్యేకు 43 సార్లు ఫోన్ కాల్‌లు
  • పట్నం నరేందర్ రెడ్డి నుంచి కేటీఆర్ కు కాల్స్
  • కాల్ డేటా వివరాలు సేకరించిన పోలీసులు
  • మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో రెగ్యులర్ టచ్

ముద్ర, తెలంగాణ బ్యూరో :- వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఘటన వెనుక అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. కలెక్టర్ పై జరిగిన దాడి పూర్తిగా రాజకీయ వ్యూహంతోనే పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో పోలీసుల దర్యాపు సైతం శరవేగంగా జరుగుతోంది. అయితే దాడి ఘటనలో పలు షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. ప్రధానం కలెక్టర్ పై దాడి ఘటనలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అగ్రనేతల కనుసన్నల్లోనే జరిగినట్లుగా తెలుస్తోంది. కొడంగల్ మాజీ ఎంఎల్ ఎ పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఈ ఘటనకు అసలు సూత్రదారుడిని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో మరింత లోతుగా పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. దీంతో కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం సేకరణ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సోమవారం లగచర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ రణ రంగాన్ని తలపించింది. గ్రామస్తుల ముసుగులో బీఆర్ఎస్ కు చెందిన యూత్ వింగ్ నాయకులు ఎంటరై అధికారులపై దాడికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. ఇందులో భాగంగానే ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అధికారి వెంకట్‌రెడ్డిలపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కలెక్టర్ తప్పించుకోగా, అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన సురేషన్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారిలో ఉన్నట్లుగా చూపిస్తున్నాడు.

నరేందర్ రెడ్డి 42 సార్లు సంభాషించిన సురేష్

జిల్లా కలెక్ట‌ర్‌తో పాటుగా ప‌లువురు అధికారుల‌ను ల‌గిచ‌ర్ల‌కు తీసుకువెళ్లడంలో ప్ర‌ధానంగా సురేష్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా తేలింది. ప్ర‌ధాన నిందితుడుగా ఉన్న సురేష్‌.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేర్కొన్నారు. దాడికి కొన్నిగంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడాడు. ఓ వైపు సురేష్‌తో మాట్లాడుతూ, మరో 6 సార్లు కేటీఆర్‌తో ఫోన్‌లో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు ఫోన్ కాల్ డేటా ప్రకారం తేలింది. దీనితో ఈ దాడి ప్లాన్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. ఇక, సురేష్‌పై ఇప్పటికే రేప్ కేసుతో సహా పలు కేసులు ఉన్నాయి. చెల్లి వరస అయ్యే అమ్మాయిపై అత్యాచారానికి గురైనందుకు రేప్ కేసు నమోదైంది. ఆయనపై కేసులు తొలగించేలా పట్నం నరేందర్‌రెడ్డి సహాయం చేసినట్టు గుర్తించారు.

స్వచ్చంధంగా ఇచ్చారా..?

వికారాబాద్ జిల్లా లగ్గిచర్లలో ఫార్మా విలేజ్‌పై అభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్‌పై స్థానిక ప్రజలు దాడి చేయడం కలకలం రేపింది. అంతే కాదు కలెక్టర్, అధికారులకు సంబంధించిన మూడు కార్లను ప్రజలు ధ్వంసం చేశారు. ఈక్రమంలో గ్రామంలో తీవ్ర హైటెన్షన్ వాతావరణం. నిర్వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగ్గిచర్ల పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేశారు. మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చారు. అయితే లగ్గిచర్ల గ్రామంలో ముందుగా ప్రజాభిప్రాయసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో తాత్కాలిక సభను నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించగా.. అందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కలెక్టర్, అధికారులు గ్రామంలోకి వచ్చి ప్రజలతో మాట్లాడేందుకు యత్నించారు. ఇంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కీలం కానున్న ఏడీజీ నివేదిక

అయితే ఈ దాడి ఘటనలో ఏడీజీ నివేదిక అత్యంత కీలకం. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అలాగే దోషులపైన కఠిన చర్యలు ఇప్పటికే ప్రభుత్వం గట్టిగా నిర్ణయించినట్లు సమాచారం. అందులోభాగంగా మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబుతో వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐజీ సమాశమయ్యారు. సోమవారం దాడి ఘటనపై వారి నుంచి మంత్రి శ్రీధర్ బాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech