ముద్ర,తెలంగాణ:-ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు బస్సు చక్రాల కింద నలిగి చనిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి పుదుచ్చేరికి బయలుదేరిన 15 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళుతున్న కారణంగా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోతా పడింది.
పోలీసులు నార్సింగ్ ఓఆర్ఆర్కు చేరుకుని తనిఖీ చేశారు. ట్రావెల్స్ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో 2 స్థానిక మేర ట్రాఫిక్ జామ్ అయింది. మృతదేహాలను పోస్ట్ మార్టంకు. పోలీసులు గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. క్రేన్ సహాయంతో సిబ్బంది బస్సును బయటకు తీశారు.