Home సినిమా ఓటిటి కోసం కాకుండా సినిమా కోసం తియ్యాలంటూ బాంబు పేల్చిన బెల్లంకొండ సురేష్ – Prajapalana News

ఓటిటి కోసం కాకుండా సినిమా కోసం తియ్యాలంటూ బాంబు పేల్చిన బెల్లంకొండ సురేష్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఓటిటి కోసం కాకుండా సినిమా కోసం తియ్యాలంటూ బాంబు పేల్చిన బెల్లంకొండ సురేష్


ఎన్టీఆర్(ntr)హీరోగా వివి వినాయక్(vv vinayak)దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆది' మూవీ ద్వారా స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన వ్యక్తి బెల్లంకొండ సురేష్(bellamkonda suresh)ఆ తర్వాత చిన్నకేశవరెడ్డి, లక్ష్మినరసింహ,మా అన్నయ్య,రైడ్, గోలీమార్, శంభో శివ శంభో,నాగవల్లి, కందిరీగ, రభస, అల్లుడు శ్రీను, కాంచన,గంగ ఇలా నిర్మాతగా సుమారు ముప్పై ఐదు సినిమాల దాకా చేసాడు.1999 లో శ్రీహరి హీరోగా వచ్చిన 'సాంబయ్య' తో సురేష్ నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేసాడు.

ఈ సందర్భంగా పరిశ్రమకి వచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతు సినిమా అనేది ప్రేక్షకుడ్ని నమ్ముకొని ప్రదర్శించాలి తప్ప ఓటి వేదికల కోసం తియ్యకూడదు.మన సినిమా ప్రేక్షకుడ్ని మెప్పించిందంటే చాలు,అన్ని వైపుల నుంచి ఆదాయం వస్తుంది.ఓటిటి మార్కెట్ తగ్గిందంటే ఆది పరిశ్రమకే మేలు. చెప్పుకొచ్చాడు.

2015లో వచ్చిన 'గంగ' మూవీ తర్వాత ఇంతవరకు సురేష్ సంస్థ అయిన శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు.ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులైన సాయిశ్రీనివాస్,గణేష్ బాబు సినీ పరిశ్రమలో హీరోలుగా రాణిస్తూ పరిశ్రమలో తమ కంటూ ఒక గుర్తింపు పొందారు.సాయి శ్రీనివాస్ అయితే పవన్ కళ్యాణ్ (pawan kalyan)హిట్ మూవీ భీమ్లానాయక్ కి దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర దర్శకత్వంలో 'టైసన్ నాయుడు' అనే మూవీతో పాటు 'భైరవం' అనే మరో మూవీ చేస్తున్నాడు.గణేష్ బాబు. ఇటీవలే 'స్వాతి ముత్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అనే అప్ కమింగ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech