ఏ సినిమా రిలీజ్ అయినా దాన్ని రివ్యూ చేస్తూ బాగుంటే బాగుందని, లేకపోతే ఎందుకు బాగా లేదని కొన్ని గంటల్లోనే సినిమా ఫలితాన్ని చెప్పేస్తారు రివ్యూ రైటర్స్. చాలా సందర్భాలలో రివ్యూ రైటర్ల గురించి ఎంతో మంది హీరోలు, నటీనటులు నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. వాళ్లకు సంబంధించిన సినిమాలు రిలీజ్ అయినపుడే ఎవరైనా మాట్లాడతారు తప్ప మిగిలిన రోజుల్లో రివ్యూ రైటర్ల గురించి ఎలాంటి కామెంట్స్ చేసారు. తాజాగా రివ్యూ రైటర్లపై అలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్. 'పొట్టేల్' చిత్రం సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 'దరిద్రానికి విరోచనలొస్తే రివ్యూ రైటర్లు పుడతారంట. మనందరం కలిసి ఇలాంటి బ్లడీ ప్యారాసైట్స్‌ని ఆపెయ్యాలి. డ్రాగ్డ్‌గా ఉందంటారు, మరోలా ఉందంటారు. ఏందంతా.. జీవితంలో షార్ట్ ఫిలిం తియ్యని నా కొడుకులు వచ్చి రివ్యూ రాసేస్తారా? సినిమా తియ్యడం ఎంత కష్టమో రాఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. అందుకే ప్రజలు. ప్రేక్షక దేవుళ్ళంటారు వాళ్ళని. సినిమాని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. మీ రివ్యూలేంటి తొక్కలో రివ్యూలు. శ్రమించి, కష్టపడి, చెమటోడ్చి ప్రాణాన్ని ఫణంగా పెట్టి సినిమాలు తీస్తూనే ఉంటాం. ప్రేక్షకులకు నచ్చుతూనే ఉంటుంది. మీలాంటి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. xxxx కన్నా దరిద్రం' అంటూ ఓ దరిద్రమైన పదాన్ని వాడారు శ్రీకాంత్ అయ్యంగార్.