గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(రామ్ చరణ్)శంకర్(శంకర్)కలయికలో తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్(గేమ్ ఛేంజర్)సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ తో మూవీపై మెగాఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా అంబరాన్నంటాయని అంచనా వేస్తున్నారు. .
ఇక డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయి.అందులో భాగంగా రామ్ చరణ్,దిల్ రాజు,ఎస్ జె సూర్య ఈ రోజు ముంబై వెళ్లడం జరిగింది.అక్కడ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి దిల్ రాజు(దిల్ రాజు)మాట్లాడడం శంకర్ గారితో సినిమా తెరకెక్కించాలనే కల నెరవేరింది.సినిమాలోని ఐదు పాటలకి 75 కోట్లు పైనే ఖర్చు చేసాం.మా బ్యానర్ లో వస్తున్న 50వ మూవీ.పైగా ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.శంకర్ సినిమాలోని పాటలకి ఎంత భారీ తనం ఉంటుందో తెలుసు.అందుకే సాంగ్స్ కి అన్ని కోట్లు ఖర్చు చేశామని చెప్పాడు.ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి.
చరణ్ డ్యూయల్ రోల్ ని పోషిస్తున్న గేమ్ చెంజర్ లో కియారా అద్వానీ,అంజలి హీరోయిన్లు గా చేస్తుండగా ఎస్ జె సూర్య,శ్రీకాంత్,సునీల్,సముద్రఖని,తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా థమన్ సంగీతాన్ని అందించారు.