Home ఆంధ్రప్రదేశ్ ఏపీలో కొండపల్లి శ్రీనివాస్ లక్ష్యంగా రాజకీయాలు.. తొలగించే ఉద్దేశ్యంతోనే ప్రచారమా.? – Prajapalana News

ఏపీలో కొండపల్లి శ్రీనివాస్ లక్ష్యంగా రాజకీయాలు.. తొలగించే ఉద్దేశ్యంతోనే ప్రచారమా.? – Prajapalana News

by Prajapalana
0 comments
ఏపీలో కొండపల్లి శ్రీనివాస్ లక్ష్యంగా రాజకీయాలు.. తొలగించే ఉద్దేశ్యంతోనే ప్రచారమా.?


ఏపీలో నాయకుకు చేసే రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఎవరికైనా అయినా చర్యలు తీసుకోవాలి అనుకుంటే ముందుగా తమకు అనుకూలంగా ఉన్న మీడియా నాయకులు వారిపై దుష్ప్రచారం చేస్తారు. అనంతరం వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం చర్యలు తీసుకుంది అనే భావన ప్రజల్లోకి వెళ్లేలా చేయడం అనేది ఒక ప్రణాళిక. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూటమికి అనుకూలంగా ఉన్న మీడియాలో పెద్ద ఎత్తున ఒక అంశంపై ప్రచారం. అదే విజయనగరం జిల్లాకు చెందిన ఒక యువ మంత్రి వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నదానిపై ఇప్పటికి స్పష్టత లేదు. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా అయితే దీనిని పెద్ద కూటమి హైలెట్ చేస్తోంది. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబాన్ని ఎదిరించాల్సిన మంత్రి ఆయన కాళ్లకు మొక్కడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అంటూ సదర్ మీడియా ఛానల్ మంత్రిని ఉద్దేశించి కథనాలు ప్రచారం చేస్తున్నారు. సమాధానం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తాను దానిపై స్పందించాల్సిన అవసరం లేదంటూ చెప్పారు.

అయితే ఇదే విషయంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్పోర్టులో కలిసినప్పుడు హుందాగా పలకరించానని, తనతో పాటు ఎంతోమంది ఆయనను ఆత్మీయంగా పలకరించారని పేర్కొన్నారు. అంతేగాని తాను పాదాభివందనం చేయలేదంటూ స్పష్టం చేశారు. ఆయన అయినప్పటికీ కొన్ని మీడియా ఛానల్స్ తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని చూస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిని కీలకమైన పరిణామంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈ జిల్లాలో వైసిపిదే హవాగా మారింది. అగ్రనాయకత్వం సీరియస్ గా కనిపిస్తున్నది. అందులో భాగంగానే కొండపల్లి శ్రీనివాస్ ను తప్పించి మరో నేతకు మంత్రి బాధ్యతలను అప్పజెప్పే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మంత్రిగా తొలగిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధంగా కొండపల్లి శ్రీనివాస్ పై బురదజల్లే ప్రయత్నాన్ని సాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

ఇదే సమావేశంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి కొండపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడానికి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రచారం గనుక పెద్ద రాజకీయమే జరుగుతుందంటూ ఇప్పటికే ఉన్నారు. కొండపల్లి శ్రీనివాసుని మంత్రివర్గం నుంచి తప్పించే ప్రక్రియలో భాగంగానే ఇదంతా వ్యూహాత్మకంగా అమలులో ఉంది. అదే రోజు ఎయిర్‌పోర్టులో ఉన్న పలువురు నేతలు కూడా బొత్స సత్యనారాయణతో సన్నిహితంగా మాట్లాడారు. కానీ వారెవరిపైన జరిగిన ప్రచారం కొండపల్లిపై మాత్రమే జరగడం వెనుక కీలకమైన కారణం ఉందని చెబుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత మంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. కానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం దక్కుతుందన్న ఆశతో ఆయన ఎదురు చూస్తున్నారు. మరి తాజా అంశాల నేపథ్యంలో మంత్రిగా కొండపల్లి శ్రీనివాసులు తొలగిస్తే సదరన్ నేతకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమీకరణాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో సరికొత్త చర్చ జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక సదర నేత హస్తం ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో చూడాల్సి ఉంది.

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో 179 మంది మృతి
2025లో థియేటర్లలో రాబోయే తెలుగు మూవీస్ ఇవే!

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech