36
ముద్ర, తెలంగాణ బ్యూరో :- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ కి కార్యదర్శిగా , రాజ్య సభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.