పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (ప్రభాస్) తో మూడు సినిమాలు చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రదర్శించనున్న 'సలార్-2' కాగా, మిగిలిన రెండు సినిమాలకు లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ దర్శకులని చూపించారు. అయితే ఈ మూడు సినిమాల కోసం హోంబలేతో ప్రభాస్ భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్లు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ స్టార్స్ ప్రభాస్ ఒకరు. ఆయన ఒక్కో సినిమాకి రూ.150 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇక ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ తో చేయనున్న మూడు సినిమాల కోసం రూ.600 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అంటే ఒక్కో సినిమాకి ఏకంగా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడన్నమాట. నిర్మాణ సంస్థ ఒక హీరోతో మూడు సినిమాల కోసం రూ.600 కోట్ల డీల్ కుదుర్చుకోవడమనేది నిజంగా రికార్డు అని చెప్పవచ్చు.
రెమ్యునరేషన్ పరంగానే కాదు, సినిమాల పరంగానూ ఏ స్టార్ కి అందని స్పీడ్ లో ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజి' చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', నాగ్ అశ్విన్ తో 'కల్కి-2' లైన్స్ ఉన్నాయి. వీటికి తోడు 'సలార్-2'తో పాటు మరో రెండు సినిమాలను హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. అంటే ప్రభాస్ చేతిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. పైగా అన్నీ భారీ సినిమాలు కావడం విశేషం.