- 27న విచారణకు హాజరుకండి
- నోటీసులు జారీ చేసిన బంజారాహిల్స్ పోలీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :-బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు ఝలక్ ఇచ్చారు.పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయనకు నోటీసులు జారీ చేశారు. 27న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నెల నాలుగున బంజారాహిల్స్ పోలీసులు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. విధులను అడ్డగించడంతోపాటు బెదిరింపులకు దిగినట్టు సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు మొత్తం 20 మంది కేసు రిజిస్టర్ అయ్యింది.ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని కోరుతూ కౌశిక్ రెడ్డి నాలుగున బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఈ కంపెనీ పైస్థాయి అధికారులు ఎవరూ లేకపోవడంతో సీఐని ప్రశ్నించారు. ఈ అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేద్దామని వచ్చి, ఆవేశంతో రెచ్చిపోయి ఆయన అడ్డంగా బుక్కయ్యారు .