25
ముద్ర ప్రతినిధి నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్ పదవి విరమణ చేశారు. బుధవారం నల్గొండ దేవదాయ శాఖ ప్రారంభోత్సవ సమావేశ సభ జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణం శ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు వేణుగోపాల చార్యులు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా దేవాలయాలకు అర్చకులకు సిబ్బందికి ఆయన ఎంతో సేవలు అందించారని చెప్పారు. అనంతరం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్ చార్యులు, సంకర్షణ ఆచార్యులు శరత్ చంద్ర, శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లాలలోని పలు దేవాలయాల అర్చకులు సిబ్బందిని ఏర్పాటు చేసి ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.