- హిందీ భాషలకు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ హితవు
త్రిభాషా సూత్రం ఈ దేశానికి శ్రేయస్కరమని, హిందీ ప్రాంతీయులు తప్పనిసరిగా ఏదో ఒక దక్షిణ భారతీయ భాష నేర్చుకోకపోవాలని అప్పుడే జాతీయ సమైక్యత సాధ్యమని పద్మభూషణ్, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. ఆ విధంగా ముందడుగు పడనంత వరకు వారికి దక్షిణాది రాష్ట్రాల వారిని హిందీ నేర్చుకోమనే అర్హత ఉండదని హితవు పలికారు. అరవింద్ ఘోష్ – హిందీ అనే అంశంపై డిల్లీలోని యన్ డి యం సి కన్వెన్షన్ హాలులో రెండు రోజుల అంతర్జాతీయ హిందీ సమ్మేళనాన్ని ఆచార్య యార్లగడ్డ గురువారం ప్రదర్శించారు.
ప్రస్తుత పరిస్థితులలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల వారికి హిందీని తమ మీద అనవసరంగా రుద్దుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే అది వారికే లాభం తప్ప ఆ భాషకేమి ఒరగదని యార్లగడ్డ వివరించారు. కేంద్ర మంత్రి మేఘవాల్, పార్లమెంటు సభ్యులు సత్యనారాయణ్ జటియా, కె సి త్యాగి, ఆర్ కె సిన్హా బ్యాడ్జెట్‌గా ఉన్నారు. దేశ విదేశాల నుండి 500 మంది ప్రతినిదులు సదస్సులో ఉన్నారు.