Home తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఎలక్షన్ హీట్… మరో ఎన్నికకు సిద్ధం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఉత్తర తెలంగాణలో ఎలక్షన్ హీట్… మరో ఎన్నికకు సిద్ధం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఉత్తర తెలంగాణలో ఎలక్షన్ హీట్... మరో ఎన్నికకు సిద్ధం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గం పట్టభద్రుల ఎన్నికపై ఫోకస్
  • కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్న జీవన్ రెడ్డి
  • ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వడంపై మల్లాగుల్లాలు
  • బీజేపీ నుంచి టికెట్ కోసం విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రయత్నం
  • బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్
  • మొదలైన రాజకీయ వ్యూహాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో మరోసారి ఎలక్షన్ హీట్ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అప్పుడే వ్యూహం, ప్రతి వ్యూహాలను అమలు చేయడంపై దృష్టి సారించాయి. మూడు రోజుల క్రితం లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇక కరీంనగర్ నియోజకవర్గం పట్టభద్రుల స్థానం (కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్)పై దృష్టి సారించాయి. త్వరలోనే ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుండడంతో ఆశావహులంతా తమ వంతు ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు.

ఈ మూడు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారనుండడంతో…. విజయం కోసం నువ్వా….నేనా అన్నట్లు పోటీ చేయడం ఖాయమని. ప్రస్తుతం ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఎల్ సీగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో మరోసారి ఈ మేరకు నిలుపుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతుండగా…..కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలన్న కసితో బీఆర్ఎస్, బీజేపీలు ఉన్నాయి. దీని పేరుకు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఎన్నిక జరుగుతున్నప్పటికీ ….అది నాలుగు జిల్లాల పట్టభద్రుల మనోగతాన్ని వెల్లడిస్తుంది. దీంతో ఈ ఎన్నికను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఖాయంగా మారింది.

దీంతో ట్రై యాంగిల్ పైట్ నెలకొనే అవకాశం ఏర్పడింది. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టిక్కెట్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉండటం, గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ పరిధిలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుండడంతో కలిసి వస్తుందని ఆశావాహులు ప్రకటించారు. దీంతో టిక్కెట్ పై నేతల్లో రోజురోజుకు ఆశలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో నేతల మధ్య పోటీ పెరుగుతోంది. కాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మొదటి సారి ఎనిమిది నియోజకవర్గాలను గెలుచుకుని మంచి జోష్ మీద ఉంది. దీంతో కమలం పార్టీలోనూ టికెట్ రేసులో నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చి గెలుపించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా పార్టీ నేతలైన సుగుణాకర్ రావు, రంజిత్ మోహన్, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, బాస సత్యనారాయణతోపాటు ఆదిలాబాద్, మెదక్, నిజామాబాదు కు చెందిన నేతలు టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ లోనూ ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇప్పటికే పోటీలో ఉండి ప్రచారం చేసుకుంటున్నారు. అదే విధంగా ప్రముఖ డాక్టర్ బీఎన్ రావు బీఆర్ఎస్ టికెట్ కోసం ట్రైనింగ్ టాక్ వినపడుతోంది. అయితే బీఆర్ఎస్ వారికి ఇచ్చి.. వారికి సపోర్టుగా ముమ్మర ప్రచారం సాగించేలా ప్లాన్ చేస్తోందని టిక్కెట్లు.

ప్రధాన పార్టీల గెలుపు గుర్రాలను బరిలోకి నిలుపాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంటే.. ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి సై అంటున్నారట. అయితే.. జాతీయ పార్టీలు టికెట్ ఇస్తే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా.. ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది.ఉత్తర తెలంగాణలో మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించారు. బీజేపీ ఎంపీ ఈ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి.. సత్తా చాటింది. ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినా.. ఎంపీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయినా ఆ సారి విజయం సాధిస్తామన్న ధీమాతో గులాబీ పార్టీ ఉంది. ఈ మూడు పార్టీలకు ఈ ఎన్నిక కీలకంగా మారనుందని.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech