Home తెలంగాణ ఉత్తమ చిత్రం 'బ‌ల‌గం' – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఉత్తమ చిత్రం 'బ‌ల‌గం' – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఉత్తమ చిత్రం 'బ‌ల‌గం' - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • ఉత్తమ నటుడిగా నాని
  • వేణు యొల్దండికి ఉత్తమ దర్శకుడి అవార్డు
  • అట్టహాసంగా 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌–2024 వేడుక
  • తెలంగాణ నేపథ్యంలో రూపొందించిన సినిమాలకు అవార్డులు
  • బలగం' టీమ్‌కు కేటీఆర్‌ అభినందనలు

ముద్ర, సినిమా ప్రతినిధి : హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌–2024 వేడుక అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు ప్రముఖులు. కొంతమంది నటీమణులు తమ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో రాశీఖన్నా, అపర్ణ బాలమురళి, సానియా ఇయాపాన్‌, గాయత్రీ భరద్వాజ్‌ వంటి వారి ప్రదర్శన ఆహుతులను అలరించింది.

చిన్నచిత్రంగా విడుదలై..

తెలంగాణ నేపథ్యంలో రూపొందించిన సినిమాలకు ఫిల్మ్‌ఆర్‌ అవార్డులు వచ్చాయి. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 'బలగం' ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా వేణు యొల్దండి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. బలగం సినిమాకు మరో అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ సహాయ నటిగా రూపలక్ష్మి అవార్డు అందుకున్నారు. 'దసరా'లో నటనకుగానూ నాని, కీర్తి సురేశ్‌ ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డును శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న) అందుకున్నారు. ఇద్దరి సినిమాల్లోనూ నాని కథానాయకుడిగా నటించడం మరో విశేషం. మొత్తంగా ఈ రెండు సినిమాలు తొమ్మిది అవార్డులు దక్కించుకున్నాయి.

'బేబీ' చిత్రానికి కూడా వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి. 'బలగం' ఉత్తమ చిత్రంగా నిలవడంతో దర్శకుడు వేణుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ 'బలగం' చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడంపై ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. దర్శకుడు వేణు, టీమ్‌ను అభినందించారు. 'ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. భవిష్యత్తులో మరిన్ని సాధించేందుకు ఇది తొలిమెట్టు.' అని కేటీఆర్ తెలియజేశారు.

ఉత్తమ చిత్రం: బలం
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (దసరా)
ఉత్తమ దర్శకుడు: వేణు యేల్దండి (బలగం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): సాయి రాజేశ్ (బేబీ)
ఉత్తమ నటి(క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్‌ పొలిశెట్టి (మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మి (బలగం)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు.. సార్‌)
ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ సంగీతం: విజయ్ బుల్గానిన్ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూరన్‌ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌ రక్షిత్‌ (ధూమ్‌ ధామ్‌ దోస్తానా.. దసరా)

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ తమిళ చిత్రాల విజేతలు..

ఉత్తమ చిత్రం: చిత్త (తెలుగులో చిన్నా)
ఉత్తమ నటుడు: విక్రమ్ (పొన్నియిన్‌ సెల్వన్‌–2)
ఉత్తమ నటి: నిమేషా సజయన్‌ (చిత్త)
ఉత్తమ దర్శకుడు: ఎస్యూణ్ కుమార్ (చిత్త)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): వెట్రిమారన్‌ (విడుదలై పార్ట్‌-–1)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సిద్ధార్థ్ (చిత్త)
ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేశ్‌ (ఫర్‌హానా), అపర్ణ దాస్‌ (దాదా)
ఉత్తమ సహాయ నటుడు: ఫహద్ ఫాజిల్ (మామన్నన్)
ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్ (చిత్త)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌–2)
ఉత్తమ గాయని: కార్తికా వైద్యనాథన్‌ (చిత్త)
ఉత్తమ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్‌ (అగ నగ.. పొన్నియిన్‌ సెల్వన్‌–2)
ఉత్తమ సంగీతం: దిబు నినాన్‌ థామస్‌, సంతోష్‌ నారాయణన్‌ (చిత్త)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌–2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి (పొన్నియిస్‌ సెల్వన్‌–2)

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech