- జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు 20 గుంటల స్థలం కేటాయించాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నేతల వినతి
ముద్రణ ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ ఉజ్వల పార్కు దివంగత నేత, తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి సరిల్లా రతన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గండి రాజేశ్వరరావు పలువురు నాయకులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ను గురువారం కలిసి వినతిపత్రం ప్రభాకర్. అదేవిధంగా కరీంనగర్ నగర పరిధిలో జగపతిరావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు 20 గుంటల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జగపతిరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారని, పేదల సంక్షేమం కోసం నిరంతరం పరితపించారని పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ ఏరియా లిమిట్స్‌లోని ఏ ప్రదేశంలోనైనా విగ్రహం ఏర్పాటు చేసేందుకు 20 గుంటల స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా జగపతిరావు పనిచేసిన కాలంలో మానేర్ డ్యామ్ పక్కన ఒక ఉజ్వల పార్కును ఏర్పాటు చేశారని చెప్పారు. ఇది కరీంనగర్ కే ప్రస్తుతం తలమానికంగా నిలుస్తున్నదని తెలిపారు. ప్రజలకు పర్యటకంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఉజ్వల పార్కుకు పేరు పెట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
జగపతిరావు 1972 నుంచి 1977 వరకు జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, 1978 నుంచి 1984 వరకు ఎమ్మెల్సీగా,. 1989 నుండి 1994 వరకు కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు. జగపతిరావు కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నేత, డైనమిక్ లీడర్ అని పేర్కొన్నారు. ఆయన అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు ఆయనను ప్రజాబంధు అని పిలుస్తారని చెప్పారు.
కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో జగపతిరావు కరీంనగర్‌లో అడవుల శాతం (%) తక్కువగా ఉన్నందున అతను చాలాసార్లు లోతైన ఆలోచన చేసి కరీంనగర్ ఉజ్వల పార్కు ఏర్పాటుకు శాయశక్తుల కృషి చేసాడు. జగపతిరావు మొక్కలు అన్న చెట్లన్న ఎంతో ప్రాణమని, ఆయన ఇంట్లో మొక్కలతో ఒక పెద్ద నందన వనమే ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రజల్లో మంచి పేరును జగపతిరావు పేరును కరీంనగర్ ఉజ్వల పార్కు పెట్టాలని మంత్రిని కాంగ్రెస్ నాయకులు చేశారు.