Home తెలంగాణ ఈడీ ఎంటర్‌ … కేటీఆర్ కేసులో మరో షాక్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఈడీ ఎంటర్‌ … కేటీఆర్ కేసులో మరో షాక్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఈడీ ఎంటర్‌ ... కేటీఆర్ కేసులో మరో షాక్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఏసీబీని నివేదిక అడిగిన ఈడీ
  • మనీ లాండరింగ్ కింద కేసు నమోదుకు నిర్ణయం
  • ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ
  • మలుపులు తిరుగుతున్న ఫార్ములా ఈ…రేసు కేసు

ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఫార్ములా ఈ -రేసు కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రాజకీయ వర్గాల్లో సెగలు రేపుతోంది. రాష్ట్ర ప్రజల్లో క్షణం..క్షణం తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ రంగంలోకి దిగేసింది. శుక్రవారం ఉదయం విచారణ మొదలుపెట్టేసింది. అప్పట్లో జరిగిన ఒప్పంద పత్రాల ఫైళ్లను పరిశీలించారు. ఈ ఐఏఎస్‌ల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

తాజాగా శుక్రవారం ఫార్ములా-ఈ రేసు కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయ్యింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఏసీబీకి లేఖ రాసింది. ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలను ఆ లేఖలో ఈడీ కోరింది. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు కూడా ఈడీ కోరినట్లు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు హెచ్‌ఎండీ అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు అందించాలని కోరినట్లు సమాచారం. అలాగే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ అడిగినట్లు. డబ్బులు చెల్లించిన తేదీల వివరాలు కూడా ఈడీ కోరినట్లుగా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందగానే మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ సాగుతోంది.

క్వాష్ పిటిషన్

ఫార్ములా ఈ…కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సింగిల్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చింది. అయితే, ఆ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారణకు అనుమతి లేదంటూ ఏసీబీ న్యాయస్థానానికి దరఖాస్తు చేసింది. దీనితో కేటీఆర్ తరఫు న్యాయవాది చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ గురించి మెన్షన్ చేయగా.. పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి రిజిస్ట్రీకి ఆదేశాలు అందాయి.

దాన కిషోర్ ఫిర్యాదుతో…..

ఫార్ములా ఈరేసు నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా విదేశీసంస్థకు సొమ్ము చెల్లించారంటూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబరు 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి రూ.54.88 మేర నష్టం వాటిల్లిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్పటి మున్పిల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆయనను ఏ1గా, సీనియర్ ఐఏఎస్‌ అరవింద్ కుమార్‌ ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏ3గా చేర్చారు. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ.. సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ మేరకు కేటీఆర్‌తో సహా మరో ఇద్దరిపై ఫైల్ చేస్తూ.. విచారణ కోసం కేసులు. ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ (సీఐయూ) డీఎస్‌పీ మాజిద్‌ అలీఖాన్‌ విచారణను ముమ్మరం చేశారు. ఇవాళ దాన కిషోర్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడంతో పాటు.. హెచ్‌ఎండీఏ ఆఫీసులో ఫైల్‌లను పరిశీలించారు.

నా తప్పు లేదు

కాగా ఫార్ములా-ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్. అసలు ఆ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదు. అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసు ఎక్కడిదని ప్రశ్నించారు. కేవలం సీఎం, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి, కుంభకోణాలను బయటపెడుతున్నందుకే.. తమపై రాజకీయ వేధింపులకు దిగుతోందని. ప్రపంచ పటంపై హైదరాబాద్‌ ఖ్యాతిని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో.. నగరంలో ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహించాలని ప్రయత్నం చేశామన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech