యంగ్ టైగర్ ఎన్టీఆర్(ఎన్టీఆర్)కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దేవర(దేవర)కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఐదు వందల పది కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసి ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ కట్ అవుట్ కి ఉన్న స్టామినాని సారి చాటి చెప్పింది. . తాజాగా మరో అరుదైన రికార్డుని సాధించి హ్యాష్‌ట్యాగ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది.
సీడెడ్(ceeded)ఏరియాకి సంబంధించి ముప్పై కోట్ల రూపాయిల షేర్ సాధించి దేవర పెద్ద సంచలనమే సృష్టించింది. కేవలం రోజుల్లో పద్దెనిమిది మాత్రమే ముప్పై కోట్లు అందుకోవడం ఒక రికార్డు అని చెప్పవచ్చు.ఎన్టీఆర్ గత చిత్రమైన ఆర్ఆర్ఆర్ అయితే ఓవర్ ఆల్ గా యాభై ఒక్క కోట్ల షేర్ ని కలిగి ఉంది. దీనితో రాయలసీమ గడ్డ మీద ముప్పై కోట్ల రూపాయల షేర్ ఉంది
ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు.
ఇక దేవర మొదటి పార్ట్ విజయంతో రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఉన్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇటీవల మాట్లాడుతు మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ చాలా పవర్ ఫుల్ గా ఉందని చెప్పుకొచ్చాడు.