- నిర్వహణ బాధ్యతలను ఎన్.ఐ.సికి అప్పగిస్తూ ఉత్వర్వులు
- త్వరలో ధరణి సమస్యలనుంచి పూర్తిగా మిముక్తి కల్పిస్తాం
- హామీ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఇప్పటి వరకు విదేశీ సంస్ధ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధరణి నిర్వహణా బాధ్యతను స్వదేశీ సంస్ధ ఎన్ ఐ సికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 1 వతేదీ నుంచి రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ బాధ్య’త’ను జాతీయ స’మాచార సంస్ధ (ఎన్‌ఐసి) నిర్వహిస్తోందని ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేయడం జరిగింద’ని మంగ’ళవారం విడుదల చేయడం జరిగింది. త్వరలో ధరణి సమస్యల నుంచి ప్రజలకు పూర్తి విముక్తి కల్పిస్తామన్నారు.
ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం లోని పెద్దలు ఎలాంటి ముందు చూపు లేకుండా హడావుడిగా తొందరపాటు నిర్ణయాలతో తీసుకువెళ్లిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్న మంత్రి పొంగులేటి. అప్పట్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు తెలంగాణకు చెందిన 1.56 కోట్ల ఎకరాల భూమిని టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని గుర్తించారు. ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఈ సంస్ధ పనిచేసి విఫలమై ఉంది. ఇటువంటి సంస్ధకు కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బిఆర్‌ఎస్ పెద్దలు కట్టబెట్టినట్లు మంత్రి పొంగులేటి దుయ్యబట్టారు. లక్షలాది రైతులకు చెందిన కోట్లాది ఎకరాల వ్యవసాయ భూములు లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ లు ఏకపక్షంగా విదేశీ కంపెనీలకు అందజేశారు. దీంతో ఐదేళ్లపాటు ధరణి పోర్టల్ రైతులకు నానా ఇబ్బందులు పెట్టారు.
అందుకే అసెంబ్లీ ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాట ధరణి పోర్టల్ విదేశీ కంపెనీల చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసుకుంటున్నారు. హామీ ఇచ్చిన విధంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసికి ఇవ్వడం వల్ల 71, 00,000 ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభించింది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఎన్నికైన ప్రణాళికలో ధరణి పోర్టల్ ప్రక్షాళన చేప’డతామ’ని ప్రకటిం చి ప్రజా అభిమానాన్ని చూరగొన్నామని తెలిపారు. మాట ఇచ్చిన మేరకు విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్న తెలంగాణ భూములను కాపాడుకోవడానికి , ఆ కంపెనీ రద్దుకు నిర్ణయించామని మంత్రి తెలిపారు. ధరణి నిర్వహణా బాధ్యతను మార్చడం వలన రాష్ట్రంలోని లక్షలాది కుటంబాలు సమస్యలు ,ఇబ్బందుల నుంచి బయటపడతాయని , అందరి భూ సమస్యలకు చక్కని పరిష్కారలలో.
2020 అక్టోబరులో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ దారితప్పి లోపభూయిష్టంగా మారి ప్రజానీకానికి శాపంగా మారింది. ధరణి పేరుతో జరిగినా దగా వల్ల తెలంగాణా సమాజం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను సమాధి చేందని మంత్రి పదార్థాలు. ఆ నాటి ప్రభుత్వ పెద్దల దాష్టీకానికి ప్రజలు అనుభవించిన బాధలు అన్నీ ఇన్నీకావని, కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి చరమగీతం పాడుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.