పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం ,ఆమె కుమారుడు శ్రీ తేజ్ అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉండటంతో అల్లుఅర్జున్,సుకుమార్ చిత్ర నిర్మాతలు జరిగిన ఘటనకు చింతిస్తూ 3 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ హోదాలో ఉన్న దిల్ రాజు(dil raju)కూడా రేవతి భర్తకి సినిమాలోనే పర్మినెంట్ ఇండస్ట్రీలో ఉద్యోగం కల్పిస్తానని మాట కూడా ఇచ్చాడు.
ఇక రేవతి కేసులో అల్లు అర్జున్(అల్లు అర్జున్)పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకి తరలించగా హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన మరుసటి రోజే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.గత విచారణలో పోలీసులు కౌంటర్‌కి సమయం సమయం.
రిమాండ్ గడువు ముగియడంతో ఇటీవల నాంపల్లి కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరవ్వగా కోర్టు తదుపరి విచారణ జనవరి 10న వాయిదా వేసింది.దీంతో సాధారణ బెయిల్ పై కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు విచారణ జరగనుంది.